తెలంగాణలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు గుడ్ న్యూస్... వేతన పెంపు చేపట్టిన ప్రభుత్వం
తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జేపీసీల నెల వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.28,719లకు పెంచింది.పెరిగిన వేతనం జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు సోమవారం(జులై 19) రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి రఘునందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల్లో మరో నిబంధనను చేర్చింది. ఇప్పటివరకూ మూడేళ్లుగా ఉన్న ప్రొబేషన్ పీరియడ్‌ను నాలుగేళ్లకు పెంచింది. దీంతో నాలుగేళ్ల తర్వాతే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలు రెగ్యులర్ కానున్నాయి. వేతన పెంపు నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం 2019లో భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రొబేషన్ పీరియడ్ రెండేళ్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఆ రెండేళ్ల పీరియడ్ పూర్తయి మరో రెండు నెలలు గడిచింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేతనాల పెంపును చేపట్టింది.
జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను ప్రభుత్వం తొలుత 2018లో భర్తీ చేసింది. అయితే ప్రొబేషన్ పీరియడ్ ఎక్కువ కాలం ఉండటంతో అప్పట్లో చాలామంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత 2019లో ఖాళీ అయిన స్థానాలను కలుపుకుని భారీ ఎత్తున పోస్టుల భర్తీ జరిగింది.
Recommended Video
ఇక తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే 50వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం త్వరలో అని చెప్పడమే తప్ప దానికి మోక్షం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత వారం వరుసగా రెండు రోజులు కేబినెట్ భేటీ జరిపి కొలువుల భర్తీపై చర్చించినప్పటికీ ఆ ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. మరో ఐదు రోజుల గడువు తీసుకుని ఖాళీలపై సమగ్ర నివేదికను సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక వచ్చాకే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. మరోవైపు నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారి ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తామని చెప్పడం... ఆపై వాయిదా వేయడం కామన్ అయిపోయిందని మండిపడుతున్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications