రేపు సెలవు పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ అమ్మవారి కి బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి మీద భక్తితో కట్నాలు, కానుకలు సమర్పించారు. పలువు రు మంత్రులు.. ప్రముఖులు బోనాలు సమర్పించిన వారిలో ఉన్నారు. బోనాలు ఉత్సవాల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యా సంస్థలకు రేపు (సోమవారం) సెలవు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణలో విద్యా సంస్థలతో పాటుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు ( సోమవారం) .. 21వ తేదీన సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే బోనాల వేళ సెలవు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఆదివారం కావటంతో సెలవు.. రేపు కూడా సెలవు ప్రకటించటంతో వరుసగా సెలవులు వచ్చాయి. ఇక.. బోనాల సందర్భంగా ఈ రోజు.. రేపు హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలలో సోమవారం లిక్కర్ షాపులు కూడా మూసివేస్తున్నారు. తిరిగి మంగళవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు.. విద్యా సంస్థలు యధా విధిగా పని చేస్తాయి.

ఇక, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ (ఆదివారం, జులై20) ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతు న్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. సున్నితమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications