TTD: సిఫార్సు లేఖల పై తాజా మార్గదర్శకాలు - బ్రేక్ దర్శనాలు ఇక వీరికే..!!

Tirumala: టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగా సిఫారసు లేఖలు.. బ్రేక్ దర్శనాల పైన కొత్త మార్గ దర్శకాలు ఖరారయ్యియి. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు ఆమోదిస్తున్న వేళ బ్రేక్ దర్శనాల కోసం ఒత్తిడి పెరుగుతోంది. దీంతో, సిఫారసు లేఖల నియంత్రణ దిశగా కొత్త మార్గదర్శ కాలను విడుదల చేసారు. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్ అందుబాటు లోకి తెచ్చింది. ఇక నుంచి టీటీడీ ఖరారు చేసిన విధానంలో వచ్చే లేఖలనే అనుమతిస్తారు.

ప్రత్యేక పోర్టల్
తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు టీటీడీలో ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తున్నారు. కాగా, ఇక నుంచి టీటీడీకి సిఫార్సు లేఖలను ఆన్‌లైన్‌లో పంపించేందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రూపొందించారు. ఇక నుంచి https://cmottd. telangana.gov.in లో సిఫార్సు లేఖల్ని నమోదు చేయడం తప్పనిసరని తెలంగాణ సీఎంఓ స్పష్టం చేసింది. టీటీడీలో దర్శనం కోసం ఇచ్చే లేఖలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందిం చింది. తాజా మార్గదర్శకాలను ప్రజా ప్రతినిధులకు పంపారు. సీఎం కార్యాలయం రూపొందించిన పోర్టల్‌ నుంచి భక్తులు, దర్శన వివరాలతో జనరేట్‌ చేసిన లేఖలను మాత్రమే టీటీడీ పరిగణ లోకి తీసుకుంటుందని తెలంగాణ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.

telangana-govt-launches-new-online-system-for-ttd-letters

మార్గదర్శకాలు
ప్రజా ప్రతినిధులు సంతకం చేసిన తర్వాత స్కాన్‌ చేసిన లేఖను టీటీడీకు అప్‌లోడ్‌ చేసి అసలు లేఖను భక్తులకు ఇవ్వాలని సూచించారు. సీఎంఆర్‌ఎఫ్‌ కోసం ఉపయోగించే లాగిన్‌ వివరాలనే టీటీడీ దర్శనం పోర్టల్‌కూ ఉపయోగించాలన్నారు. ప్రజాప్రతినిధులు తమ కోటాకు మించి సిఫా ర్సు లేఖలు ఇవ్వడం, వాటితో తిరుమలకు వెళ్లిన భక్తులు ఇబ్బంది పడటం వంటి అనుభవాల నేపథ్యంలో ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే నిర్ణయించిన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖల్ని సోమవారం నుంచి గురువారం వరకు దర్శనాలకే జారీ చేయా లి. ఒక రోజుకు ఒక లేఖ మాత్రమే ఇవ్వాలి. సోమ, మంగళవారాల్లో వీఐపీ బ్రేక్‌దర్శనం కు అనుమతి ఇస్తారు. దీంతోపాటు వసతి కూడా ఇస్తారు. బుధ, గురువారాల్లో రూ.300 దర్శనం ఉంటుంది. వసతి సౌకర్యం ఉండదు. భక్తులు ఒరిజినల్‌ లేఖతో వెళ్లాల్సి ఉంటుంది.

Take a Poll

బ్రేక్ దర్శనాల్లో మార్పులు
తిరుమలకు సిఫారసు లేఖలతో వెళ్లేవారిలో ఆధార్‌ కార్డు లేని చిన్నపిల్లలు ఉంటే బర్త్‌ సర్టిఫికెట్‌తో వెళ్లాలని సూచించారు. ఇక, తిరుమలలో బ్రేక్ దర్శనాల సమయాలను మార్పు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ విధానం పైలెట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. మధ్నాహ్న సమయం వరకు బ్రేక్ దర్శనాలు కొనసాగుతుండటంతో.. సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో, గతంలో అమలు చేసిన విధంగా బ్రేక్ దర్శనం ఉదయం 5.30 -6 గంటల మధ్యలో అనుమతించటం పైన తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. ఇప్పుడు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సాధారణ భక్తులకు ప్రయోజనం ఉంటే... ఈ విధానాన్నే కొనసాగించాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+