ఆ రైతులకు భారీ శుభవార్త చెప్పే ప్లాన్..వారి పంట పండినట్టే!
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలను సాగుచేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యాన పంటలను సాగు చేసే రైతాంగాన్ని ప్రోత్సహించడం కోసం, ఉద్యాన పంటల సాగును పెంచడం కోసం కేరళలో కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటల సాగు విధానాన్ని అధ్యయనం చేసిన రైతు సంక్షేమ కమిషన్ ఆ దిశగా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపింది.
ఉద్యాన పంటల సాగుపై అధ్యయనం చేసిన కమీషన్
కేరళలో అమలవుతున్న విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి నేతృత్వంలోని బృందం ఇటీవల కేరళలో ఉద్యాన పంటల సాగుపై అధ్యయనం చేసి అక్కడ అమలు చేస్తున్న విధానాన్ని రైతు సంక్షేమ కమీషన్ అధ్యయనం చేసింది.

రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు కూరగాయలకు పంటల బీమా
ఉద్యాన పంటల సాగులో ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు కూరగాయలకు పంటల బీమా అమలు చేయడం, సామూహిక పంట క్షేత్రాలను ఏర్పాటు చేయడం, సాగు చేస్తున్న కూరగాయలు, ఉద్యాన పంటలపైన పంచాయతీల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఉత్పత్తుల క్లస్టర్లు, ధరల సంక్షోభం ఏర్పడిన సమయంలో పెట్టుబడికి 20శాతం కలిపి మూలధన నిర్ణయం చేసారు.
కేరళలో ప్రభుత్వం కూరగాయల పంటల బీమా
ప్రభుత్వం, రైతులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రత్యేక సంస్థ ద్వారా సేద్యానికి ఊతం ఇవ్వడం కేరళలో ముఖ్యంగా ఉద్యాన పంటల సాగు విధానం. ఇక ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని రైతు సంక్షేమ కమిషన్ నివేదికతో ప్రభుత్వం దీనిపైన సమాలోచన చేస్తుంది. కేరళలో సాధారణ రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా ప్రభుత్వం కూరగాయల పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుంది.
కేరళ ప్రభుత్వమే ఉద్యాన పంటలకు బ్రాండింగ్
ప్రతి నాలుగు గుంటల భూమికి పది రూపాయల ప్రీమియం ఉంటుంది. కూరగాయలు, పండ్లకు ప్రభుత్వం సేఫ్ టు ఈట్ పేరిట బ్రాండింగ్ ఇస్తూ విస్తృతమైన ప్రచారం కల్పిస్తోంది. సుభిక్ష కేరళం పథకం కింద ప్రతి ఇంట్లోనూ గార్డెన్ ఏర్పాటుకు విత్తనాలు, పరికరాలను అందిస్తోంది. ఈ విధానం ద్వారా కేరళలో ఉద్యాన బాగు చేసే రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఇక ఇదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే బాగుంటుందన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఒకవేళ ఇదే కనుక అమలయితే ఉద్యాన సాగు చేసే రైతుల పంట పండినట్టే.












Click it and Unblock the Notifications