నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - ఒకేసారి 49 వేల ఉద్యోగాల భర్తీ : కేబినెట్ ఆమోదంతో..!!
ఎంతో కాలంగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఖాళీలు భర్తీ చేయాలని..కొత్త నియామకాలు చేపట్టాలంటూ కేసీఆర్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. దీంతో త్వరలోనే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేస్తామని శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా..వచ్చే కేబినెట్ నాటికి శాఖల వారీగా ఖాళీల వివరాలతో ఫైల్ సిద్దం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇక, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల గుర్తింపు కసరత్తు తుదిదశకు చేరుకుంది.

సుదీర్ఘ కసరత్తు.. 49 వేల ఖాళీలు గుర్తింపు
కాంట్రాక్టు..అవుట్ సోర్సింగ్ కాకుండా..రెగ్యులర్ పోస్టుల కింద దాదాపు 49 వేల ఖాళీలు ఉన్నట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి ఖాళీల గుర్తింపు కోసం ప్రభుత్వ విభాగాలతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా పొరుగు, ఒప్పంద ఉద్యోగాలు సహా ప్రత్యక్ష నియామకాల కింద చేపట్టాల్సిన ఖాళీల వివరాలపై ఆర్థికశాఖ అధ్యయనం చేసింది. టీఎస్‌పీఎస్సీ, గురుకుల నియామక, పోలీసు, వైద్య, పంచాయతీరాజ్ నియామక బోర్డుల పరిధిలోకి వచ్చే ఉద్యోగాల సంఖ్యను గుర్తించింది.

జోన్ల వారీగా వర్గీకరణ పూర్తి
కీలకమైన జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా వర్గీకరణ ఇప్పటికే పూర్తయింది. ఏయే పోస్టులు ఏ కేటగిరీలోకి వస్తాయో స్పష్టతనిస్తూ ఉత్తర్వులూ వెలువడ్డాయి. ఈ క్రమంలో బుధవారమిక్కడ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్, మల్టీజోనల్ వారీగా వివిధ శాఖల నుంచి తీసుకున్న సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరం ఖాళీలపై స్పష్టతకు వచ్చారు. అయితే, గ్రామ రెవిన్యూ అధికారులకు ప్రస్తుతం ధరణి అమల్లోకి తీసుకురావటం ద్వారా విధుల కేటాయింపు జరగటం లేదు.

వీర్వోల సర్దుబాటు పైన ఫోకస్
దాదాపుగా ఆరు వేల మంది వీఆర్వోలను ప్రభుత్వ శాఖల్లోనే సర్దుబాటు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో సుమారుగా పది వేల మంది ఒప్పంద ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ ఉద్యోగులను మినహాయించి ప్రత్యక్ష నియామకాల కింద భర్తీ చేయాల్సిన ఖాళీలను గుర్తించారు. కాంట్రాక్టు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిర్వహిస్తున్న విధులను ఈ ఖాళీల జాబితాలోకి తీసుకోవటం లేదని సమాచారం. ఆ పోస్టులను సైతం రెగ్యులర్ కోటా నిర్ణయిస్తే వారు ఉపాధి కోల్పోతారనే ఉద్దేశంతో మినహాయించినట్లు తెలుస్తోంది.

మంత్రివర్గం ముందుకు ఫైల్..
అయితే, ఈ ఉద్యోగుల విషయంలో సర్వీసు క్రమబద్ధీకరించేందుకు ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపైనా ఆర్థికశాఖ సమాలోచనలు చేసింది. ఒప్పంద ఉద్యోగులకు సర్వీసు వెయిటేజీ ఇచ్చి, పోటీ పరీక్షలు నిర్వహించాల్సిన అవరం ఉందా.. లేక ఇతరత్రా అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వీఆర్‌ఏలను రైతు వేదికలు, ఇతర విభాగాల్లో సర్దుబాటు చేయడంపై సమావేశం చర్చించనుంది. ఈ కసరత్తు ఇంకా కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశం తేదీ ఖరారు అయి..సమావేశం జరిగే నాటి వరకు గుర్తించిన మొత్తం ఉద్యోగాల ఖాళీల వివరాలను సమావేశం ముందు ఉంచనున్నారు.

కేబినెట్ ఆమోదించగానే.. ఒకే విడతలో భర్తీ దిశగా
ఆ దస్త్రానికి కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే ఆర్థికశాఖ ఖాళీలను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ మేరకు సంబంధిత విభాగాలు సర్వీసు నిబంధనలు, రోస్టర్, రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు, ఎంపిక విధానాన్ని సంబంధిత నియామక ఏజెన్సీలకు అందజేస్తాయి. అనంతరం నియామక ఏజెన్సీలు నిర్ణీత గడువులోగా ప్రకటన వెలువరించి దరఖాస్తులు స్వీకరిస్తాయని, అన్ని ప్రకటనలూ ఒకేసారి వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, దశల వారీగా ఆమోదిస్తారా..లేక, ఒకే సారి నియామక ప్రక్రియ చేపడతారా అనేది ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications