పోలవరం ప్రాజెక్ట్ పై ఏపీ ప్రతిపాదన.. షాకిచ్చిన తెలంగాణా
ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు, గోదావరీ నదీ జలాల విషయంలో వివాదాలు సద్దు మణగటంలేదు. ఏదో ఒక చోట ఏపీ ఆలోచనలకు తెలంగాణా బ్రేక్ వేయటం, తెలంగాణా ఆలోచనలకూ ఏపీ బ్రేక్ వేయటం జరుగుతున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ నుండి నీటి ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్న వార్తలపైన తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
గోదావరీ నదీ బోర్డుకు, పోలవరం ప్రాజెక్ట్ అధారిటీకి తెలంగాణా లేఖ
ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గోదావరి నది యాజమాన్య బోర్డు తో పాటు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తాను లేఖ రాసినట్టుగా ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ లో డెడ్ స్టోరేజ్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ ఎత్తిపోతలు చేపట్టకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆ లేఖలో కోరారు.

ఏపీ నీటిని ఎత్తిపోస్తే తెలంగాణాకు నష్టం
గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం తరపున ఈఎన్సీ లేఖ రాశారు. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపడితే తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత ఉండదని, గోదావరి డెల్టాకు నష్టం జరుగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ అనిల్ కుమార్ ఆంధ్ర పదేశ్ కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండానే ముందుకి పోతోందని, దీనివల్ల గోదావరి పరివాహక ప్రాంతం ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు.
జలసంఘం తక్షణం జోక్యం చేసుకోవాలని లేఖ
తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినప్పటికీ నీటి కొరత పేరిట అభ్యంతరాలు వ్యక్తం చేసే ఆంధ్రప్రదేశ్ డెడ్ స్టోరేజ్ నుంచి ఇప్పుడు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభిస్తుంది అని అన్నారు. ఇది ఏ విధంగా సమంజసం అని ప్రశ్నించారు. ఇది కేంద్ర జల సంఘం నిబంధనలకు వ్యతిరేకమని అందువల్ల జలసంఘం తక్షణం జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రక్రియ చేపట్టకుండా ఆపాలని లేఖలో కోరారు. డెడ్ స్టోరేజ్ నుంచి నీటి ఎత్తిపోతలను నిలుపుదల చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications