Dalith Bandhu : హుజురాబాద్‌లో దళిత బంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయనున్న దళిత బంధు పథకం కోసం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతలో రూ.500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.2వేల కోట్లు ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం వెచ్చించనున్నారు. వారం రోజుల్లోపు మిగతా రూ.1వెయ్యి కోట్లు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హుజురాబాద్‌లో సంపూర్ణంగా... మిగతా 118 నియోజకవర్గాల్లో పాక్షికంగా ఈ పథకాన్ని అమలుచేయనుంది. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మందికి రూ.10లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హుజురాబాద్‌ నుంచి దీనికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం... అక్కడ ప్రతీ దళిత కుటుంబానికి పథకాన్ని అందిస్తామని చెబుతోంది. ఆగస్టు 16న హుజురాబాద్ నియోజకవర్గంలోని 15 దళిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెక్కులు అందజేశారు. దళిత బంధు పూర్తిగా సబ్సిడీ పథకమేనని... తిరిగి ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.

 telangana govt releases rs.500cr for dalith bandhu scheme in huzurabad

మరోవైపు దళిత బంధు పథకం ఓట్ల బంధు పథకమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. నిజంగానే కేసీఆర్‌కు దళితుల పట్ల అంత ప్రేమ,వారికి మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే... ఉపఎన్నికకు ముందే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీన్ని అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు,బీసీ,ఎస్టీలకు సైతం ఈ పథకాన్ని అమలుచేయాలని... అందులోని పేదలకు రూ.10లక్షలు చొప్పున అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్... వాటిని ఎందుకు నెరవేర్చలేదని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. దళిత బంధు పథకం కూడా ఆరంభ శూరత్వమే తప్ప... చివరి వరకు కొనసాగదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం... ఆరు నూరైనా ఈ పథకాన్ని అమలుచేసి తీరుతామని అంటున్నారు. తెలంగాణ దళితులు దేశానికే ఆదర్శంగా నిలిచేలా వారిని ఆర్థికంగా నిలబెడుతామని అంటున్నారు. నిజానికి ఏడాది కింద ప్రారంభం కావాల్సిన ఈ పథకం... కరోనా వల్ల ఆలస్యమైందని చెబుతున్నారు.అయితే ఇంతవరకూ ఈ పథకానికి సంబంధించిన స్పష్టమైన విధి విధానాలు లేకపోవడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి సాధ్యం కాని పథకాలను తెర మీదకు తెస్తున్నాడని విమర్శిస్తున్నాయి.

తెలంగాణలో దళితుల జనాభా దాదాపు 80లక్షల వరకు ఉంటుందనేది అంచనా. రాష్ట్రంలో వారిదే అత్యధిక జనాభా అని ఇటీవలి సభలో కేసీఆర్ పేర్కొన్నారు. దాదాపు 25లక్షల దళిత కుటుంబాలు ఉంటాయనే అంచనా ఉంది. ఈ లెక్కన దళితుల ఓట్లు గంప గుత్తగా పొందగలిగితే 2023లోనూ మరోసారి అధికారం తమదేనని భావనలో కేసీఆర్ ఉన్నారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+