ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు.. ఎన్నికల సంఘానికి తెలంగాణ సర్కార్ లేఖ
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. కరోనా పరిస్థితుల రీత్యా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని... మరికొద్ది రోజులు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలనుకోవట్లేదని తెలిపింది. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో లేఖ ద్వారా ప్రభుత్వం ఈ సమాచారాన్ని పంపించింది.
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3న ముగిసిన సంగతి తెలిసిందే. పదవీకాలం ముగిసినవారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. సాధారణంగా గడువు ముగిసే సమయానికి ముందే ఈసీ ఆ ఖాళీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ కోవిడ్ కారణంగా ఎన్నికల సంఘమే కొంత కాలం ఎన్నికలను వాయిదా వేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రకాల కార్యకలాపాలు పునరుద్దరించబడటంతో ఎన్నికల నిర్వహణపై ఈసీ ఆలోచన చేస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని ఈసీ తెలంగాణ సర్కార్‌ను కోరింది. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా వెల్లడించిన ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలిపింది. దీంతో ఇప్పట్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సూచనలు కనిపించట్లేదు.
మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నిక కూడా ఆలస్యమవుతుందేమోనన్న చర్చ జరుగుతోంది.జూన్ 12న ఈటల రాజేందర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా డిసెంబర్ లోగా అక్కడ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం అగస్టు లేదా సెప్టెంబర్‌లో షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతుండటం... థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నిక కూడా కొంత ఆలస్యమవొచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications