తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే - ప్రభుత్వ ప్రకటన..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్ధుల కు బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇంటర్ ఫలితాల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్ధులు వేచి చూస్తున్నారు. అటు ఏపీలో ఇంటర్ ఫలితాలు గత వారం విడుదల చేసారు. పదో తరగతి ఫలితాలు 23న విడుద ల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఇప్పుడు తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. విద్యార్ధుల ఉత్కంఠకు తెర దించుతూ ఈ నెల 22న ఫలితాల విడుదల చేయనున్నట్ల ప్రభుత్వం ప్రకటన చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు. ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి.

telangana-govt-to-announce-inter-results-on-22nd-of-this-month

కాగా, మార్చి 5వ తేదీ నుంచి 1532 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలను నిర్వహించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 9, 96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా రిజల్ట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 18 నుంచే స్పాట్ వాల్యుయేషన్ను 19 కేంద్రాల్లో ప్రారంభించిన ఇంటర్ బోర్డు అనుకున్న సమయానికే ఫలితాలు ఇచ్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా రాండమ్ రీవాల్యుయేషన్ సైతం నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఇంటర్మీడియట్ బోర్డ్ జాగ్రత్తలు తీసుకుంది. దీంతో రెండు దశల్లో పరిశీలన చేసిన తర్వాతే ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు సిద్ధమైంది. సిజిజి ఆమోద ముద్రలతో ప్రభుత్వం అనుమతి తీసుకొని ఈనెల 22న ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు సైతం అవకాశం ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+