టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) మంగళవారం కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షను పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్‌ పద్ధతిలోనే జరుపనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

గ్రూప్-1 పరీక్ష గత అక్టోబర్‌ 16న జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 2,85,916 మంది పరీక్షను రాశారు. వీరిలో 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తూ కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. అయితే అనూహ్యంగా గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూడటంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తో పాటు మరికొన్ని పరీక్షలను కూడా రద్దు చేసింది.

Telangana Group-1 prelims exam on June 11th: TSPSC

అనంతరం మళ్లీ కొత్త తేదీలను ప్రకటించిన కమిషన్.. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పరీక్ష విభాగాన్ని తీసుకొచ్చింది. టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌గా బీఎం సంతోష్‌, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌ జగదీశ్వర్‌ రెడ్డిని నియమించింది.

కొత్తగా డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, సీనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, జూనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌ ప్రోగ్రామర్‌, జూనియర్‌ ప్రోగ్రామర్‌, లా ఆఫీసర్‌ (జూనియర్‌ సివిల్‌ జడ్జి క్యాడర్‌) పోస్టులను మంజూరు చేసింది. గతంలో పనిచేసిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అందరినీ మార్చడంతో పాటుగా మళ్లీ కొత్తగా ప్రశ్నపత్రాలను రూపొందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+