గ్రూప్-2పై హైకోర్టు కీలక తీర్పు
గ్రూప్-2 ర్యాంకర్లకు భారీ ఊరట లభించింది. గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వారి నియామకాలను రద్దు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది.ఈ మేరకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

2015లో నిర్వహించిన గ్రూప్-2 మెరిట్ జాబితాను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ ఇటీవలే పిటిషనర్లు మళ్లీ డివిజన్ బెంచ్ కు అప్పీలుకు వెళ్లడంతో.. ఇవాళ మరోసారి వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మెరిట్ లిస్ట్ చెల్లదంటూ చెప్పిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల తర్వాత ఈ నియామక ప్రక్రియపై డివిజన్ బెంచ్ తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.ఈ తీర్పుతో తెలంగాణలోని గ్రూప్-2 అభ్యర్థులు, ప్రభుత్వ నియామక ప్రక్రియకు సంబంధించిన దీర్ఘకాలిక వివాదానికి సంబంధించిన కేసులో ఒక ముఖ్యమైన మలుపు వచ్చినట్లు అయింది.












Click it and Unblock the Notifications