బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు హైకోర్టు నోటీసులు: ఎందుకంటే?
ఆదిలాబాద్: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యే జోగు రామన్నతోపాటు జిల్లా అధికారులకు తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. భూమి పూజ విషయంలో ఎమ్మెల్యేతోపాటు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మావల తహశీల్దార్, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
తనకు సంబంధించిన భూమిలో ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం ఎమ్మెల్యే జోగు రామన్న ఇటీవల భూమి పూజ చేశారని గంగుబాయి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించింది. మే 29వ తేదీన భట్టి సవర్గాం శివారులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే భూమి పూ చేసిన విషయం తెలిసిందే.

అయితే, ఆ భూమి తనదేనని గంగుబాయి.. హైకోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్, మావల తహశీల్దార్.. మొత్తం ఆరుగురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
గ్రూప్-3,4 పరీక్షలకు నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించే గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది.
గ్రూప్-3, గ్రూప్-4లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులను తొలగించారని పిటిషన్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. జీవో 55, 136 కొట్టివేయాలన్న పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 13కు వాయిదా వేసింది కోర్టు.












Click it and Unblock the Notifications