తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత: సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశదో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్ కేశవరావు మృతితో రాష్ట్రంలోని కోర్టులకు ఉన్నత న్యాయస్తానం సోమవారం సెలవు ప్రకటించింది.
2017, సెప్టెంబర్ 21 నుంచి జస్టిస్ కేశవరావు హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. న్యాయమూర్తి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

జస్టిస్ కేశవరావు కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేద ప్రజలకు న్యాయమూర్తి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్తానంలో జస్టిస్ కేశవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications