విడాకుల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. వంట రాకపోతే !!
విడాకుల కేసు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు అయినప్పుడు.. భార్య వంట చేయకపోవడం లేదా అత్తమామలకు సహకరించకపోవడం 'క్రూరత్వం' కిందికి రాదని న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగ బాధ్యతలను పరిగణనలోకి తీసుకోకుండా భార్యపై గృహ పనుల పేరుతో ఆరోపణలు చేయడం సరైంది కాదని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఈ కేసు ఎల్బీనగర్‌కు చెందిన ఓ దంపతులకు సంబంధించినదిగా తెలుస్తోంది. భర్త తన భార్య తనపై మానసిక క్రూరత్వానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ విడాకుల కోసం దిగువ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ కోర్టు భర్త ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. ఈ అప్పీల్‌పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నాగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

అందులో భాగంగా విచారణలో భర్త మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉద్యోగం చేస్తుండగా.. భార్య ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో భార్య ఉదయం వంట చేయలేదన్న కారణంతో ఆమెను క్రూరత్వానికి బాధ్యురాలిగా భావించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు పరస్పర అవగాహనతో పంచుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.
అంతే కాకుండా భార్య తరచూ పుట్టింటికి వెళ్తోందని, వివాహమై ఏడాది 9 నెలల కాలంలో కేవలం 3 లేదా 5 నెలలు మాత్రమే తనతో ఉందని భర్త చేసిన వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది. ముఖ్యంగా గర్భస్రావం జరిగిన తర్వాత భార్య తల్లిదండ్రుల వద్ద ఉండటాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టంగా తెలిపింది. వేరు కాపురం ప్రతిపాదన కొన్ని సందర్భాల్లో క్రూరత్వంగా పరిగణించవచ్చని కోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో వేరు కాపురం సూచన భార్య నుంచి కాకుండా ఆమె న్యాయవాది నుంచి మాత్రమే వచ్చిందని తెలిపింది. అందువల్ల దీనిని కూడా భార్యపై ఆరోపణగా పరిగణించలేమని తేల్చింది.
భర్త చేసిన అన్ని ఆరోపణలను పరిశీలించిన తర్వాత, ఇవేవీ హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వంగా పరిగణించదగినవి కావని ధర్మాసనం తుది నిర్ణయానికి వచ్చింది. గృహ జీవితంలో ఉద్యోగ భార్యపై అనవసరమైన ఒత్తిడి తేవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు పూర్తిగా కొట్టివేస్తూ, విడాకులు మంజూరు చేయలేమని స్పష్టమైన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ఉద్యోగినైన మహిళల హక్కుల పరిరక్షణకు దిశానిర్దేశం చేసేలా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తెలంగాణ డిస్కంలకు సింగరేణి ఊహించని షాక్.. రాజస్థాన్ కు కరెంట్ విక్రయం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications