హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఐ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల: ఎప్పట్నుంచంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమవారం విడుదలైంది. అక్టోబర్ 8 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. తొలి విడత కౌన్సెలింగ్ లో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కోసం అక్టోబర్ 8 నుంచి 12 వరకు స్లాట్ బుకింగ్ ఉంటుందని పేర్కొంది.

అక్టోబర్ 10 నుంచి 13 వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుందని విద్యామండలి తెలిపింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం ఐ-సెట్‌ను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించింది. జులై 28న తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 76,160 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడత పరీక్షకు 90.93 శాతం, రెండో విడత పరీక్షకు 91.43 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐసెట్ ప్రిలిమినరీ కీ ని ఆగస్టు 4న విడుదల చేశారు.

Telangana I-CET counselling schedule released: starts from October 8th

కౌన్సెలింగ్ షెడ్యూల్:

అక్టోబర్ 8 నుంచి 12 వరకు ధృవ పత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్
అక్టోబర్ 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన
అక్టోబర్ 10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
అక్టోబర్ 18న ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్ల కేటాయింపు
అక్టోబర్ 23 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
అక్టోబర్ 23 నుంచి 25 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు
అక్టోబర్ 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు
అక్టోబర్ 28న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల

English summary
Telangana I-CET counselling schedule released: starts from October 8th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X