తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పెంపు: ఎప్పటి వరకంటే?
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డ్ పొడిగించింది. నేటి(మంగళవారం)తో గడువు ముగియడంతో విద్యార్థుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న అధికారులు మే 19 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువును కూడా మే 19 వరకు పొడిగించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా, ఇటీవలే తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మే 9న హైదరాబాద్ లో ఫలితాలను విడుదల చేశారు. ఈసారి జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మరోసారి బాలికలదే పైచేయి అయినట్లు సబిత వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 61.88 శాతం, రెండో సంవత్సరంలో 63.49 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ బాలికలు టాప్ లో నిలిచారు.
ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకూ తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇందులో 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ లో మొత్తం 4,33.82 మంది పరీక్ష రాయగా.. ఇందులో 2.72,208 ఉత్తీర్ణులు అయ్యారు. ఇందులో ఏ గ్రేడ్ 1,60 వేల మంది, బి గ్రేడ్ 68వేల 330 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బాలికలు -2,17454 మందికి లక్షా 1,49729 మంది పాస్ అయ్యారు.
ఈసారి ఇంటర్ ఈ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఫస్టియర్‌లో బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణులు కాగా.. బాలురు 54.66 శాతం మాత్రమే పాసయ్యారు. సెకండియర్‌లో బాలికల 71.57 శాతం పాస్ కాగా.. బాలురు 55.60 శాతం మాత్రమే పాసయ్యారు.
అలాగే ఈ ఏడాది తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్ లో మేడ్చల్ జిల్లా, సెకండియర్ లో ములుగు జిల్లా టాప్ లో నిలిచాయి. జూన్ 4 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications