తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలు విడుదల: ఇలా తెలుసుకోండి
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఫలితాల్లో 56 శాతం బాలికలు, 52 శాతం బాలురు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు డిసెంబర్ 22 వరకు గడువు విధించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.

ఫలితాలను https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. అంతేగాక, https://results.cgg.gov.in/వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను చూసుకోవచ్చు.
డిసెంబర్ 17న సాయంత్రం 5 గంటల తర్వాత విద్యార్థులు మార్కుల వివరాల(మెమో)లను తెలిపిన వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు. రీకౌంటింగ్ కోసం పేపర్‌కు రూ. 100, స్కాన్ కాపీతోపాటు రీ వెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు పేపర్ కు రూ. 600 ఫీజు చెల్లించి ఈ సేవలు పొందవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది.
Recommended Video
కాగా, ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 4,09,911 మంది, వొకేషనల్ విద్యార్థులు 49,331 మంది హాజరయ్యారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 4,59,242 మంది. కాగా జనరల్ విద్యార్థులు 1,99,786 మంది, వొకేషనల్ విద్యార్థులు 24,226 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications