రేపు ఉదయం 11.00 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 11.00 గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.













Click it and Unblock the Notifications