తెలంగాణ రాష్ట్ర ఐపీఎస్‌లకు ఫార్చ్యూనర్ కార్లు
హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో సమూలంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఐపీఎస్ అధికారులకు విలువైన లగ్జరీ ఫార్చ్యూనర్ కార్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
జిల్లా ఎస్పీ స్ధాయి నుంచి డీజీపీ వరకు అందరికీ ఫార్చ్యూనర్ కార్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఫార్చ్యూనర్ కారును వినియోగిస్తుండగా, మరో నెల రోజుల్లో సుమారు 70 మంది ఐపీఎస్‌లకు ఫార్చ్యూనర్ కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి.

వీటితో పాటు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నుంచి డీఎస్పీ స్ధాయి అధికారులకు కూడా కొత్త వాహనాలు ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఇక పెట్రోలింగ్ నిర్వహణకు 426 సుమోలు, 256 బొలెరోలను పోలీసు శాఖ కొనుగోలు చేసింది. రెండో రోజుల్లో ఈ వాహనాలు ఆయా జిల్లాల అధికారులకు అందనున్నాయి.












Click it and Unblock the Notifications