హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం, మాంసం విషయంలోనే కాదు.. మరో విషయంలో కూడా మనమే టాప్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : మద్యం, మాంసం వినియోగంలో టాప్ లో నిలిచిన తెలంగాణ.. మరోసారి వార్తల్లోకెక్కింది. కోడిగుడ్ల వినియోగంలోనూ మొదటి స్థానం ఆక్రమించింది. మిగతా రాష్ట్రాలను తోసిరాజంటూ ముందు వరుసలో నిలిచింది. తెలంగాణలో ఒక్కొక్కరు ఏడాదికి 180 గుడ్లను వినియోగిస్తున్నారట. దీని ప్రకారం వంటింట్లో కూరగాయలతో పాటు కోడిగుడ్ల వాడకం బాగానే పెరిగినట్లు లెక్క.

 గుడ్డు.. వెరీగుడ్డు

గుడ్డు.. వెరీగుడ్డు

కోడిగుడ్ల వినియోగంలో తెలంగాణ టాప్ లో నిలిచింది. దేశంలోనే నెంబర్ 1 స్థానం సొంతం చేసుకుంది. జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (నెక్) వివరాల ప్రకారం.. కోడిగుడ్ల వాడకంలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. ఇక్కడ కోడిగుడ్ల తలసరి వినియోగం సంవత్సరానికి 180గా ఉన్నట్లు పేర్కొంది ఆ సంస్థ. జాతీయ పౌష్టికాహార సంస్థ పేర్కొన్న తలసరి వినియోగానికి ఇది సమానంగా ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తమిళనాడులో 123 కోడిగుడ్ల తలసరి వినియోగం ఉండగా, ఏపీలో 119 గా నమోదైంది.

తెలంగాణ ఫస్ట్.. రాజస్థాన్ లాస్ట్

తెలంగాణ ఫస్ట్.. రాజస్థాన్ లాస్ట్

తెలంగాణ, తమిళనాడు, ఏపీ ముందు వరుసలో నిలిస్తే.. ఆ తర్వాత స్థానాలను కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, చత్తీస్ గఢ్ ఆక్రమించాయి. ఇక కోడిగుడ్ల వినియోగంలో దేశంలోనే చివరిస్థానంలో నిలిచింది రాజస్థాన్. అక్కడ తలసరి వినియోగం 12 కోడిగుడ్లు. ఇక దేశవ్యాప్తంగా ప్రతినిత్యం 22 కోట్ల మేర కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో తెలంగాణ వాటా 3 కోట్ల 20 లక్షలు.

 నిత్యావసరమే..!

నిత్యావసరమే..!

తెలంగాణలో కోడిగుడ్ల వినియోగం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రోజువారీ సరాసరి చూసినట్లయితే కోటి 70 లక్షల మేర కోడిగుడ్లు వంటింటికి చేరుతున్నాయి. ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 55 లక్షల కోడిగుడ్లు వినియోగిస్తున్నారట. హోటళ్ల వ్యాపారం ఇక్కడ ఎక్కువగా ఉండటంతో కోడిగుడ్ల వాడకం కూడా ఎక్కువగా ఉంటుందనేది ఒక అంచనా.

చుక్క.. ముక్క

చుక్క.. ముక్క

మద్యం, మాంసం విక్రయాల్లో కూడా తెలంగాణ ముందు వరుసలో నిలుస్తోంది. అమ్మకాల విషయంలో ఈ రెండింటికి ఉన్న ప్రాధాన్యత చెప్పనవసరం లేదు. వారానికోసారి మాంసం తినేవారు కూడా ఇటీవల రెండు, మూడు రోజులు తింటున్న సందర్భాలుంటున్నాయి. అంతేగాకుండా ఫుడ్ బిజినెస్ పెరగడం, డోర్ డెలివరీ సౌకర్యం తదితర కారణాలతో కూడా మాంసం విక్రయాలు పెరిగాయని చెప్పొచ్చు. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం.. మద్యం అమ్మకాల విషయంలో తెలంగాణ, ఏపీ 2వ స్థానం ఆక్రమించాయి.

English summary
Alcohol and meat consumed in the top of the Telangana .. once again in the news. The first place in the use of eggs. The rest of the states are in the front line. In Telangana, about 180 eggs per year are used.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X