Weather Update: అల్పపీడనంగా మారిన వాయుగుండం.. మరో మూడు రోజులు వానలే..!
వచ్చే మూడు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్న ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మూడు రోజులు పాటు ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. అలాగే గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో గాలులు విస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. చిలికా సరస్సు వద్ద ఏర్పడిన వాయుగుండం రాత్రి బలహీన పడి అల్పపీడనంగా మారిందని వివరించింది. వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాన్ని తాకిందని తెలిపింది.

వచ్చే 12 గంటల్లో ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింద. గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హనుకొండ, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం అసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, నిజమాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ఇక కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపే, కామారెడ్డి, జనగాం, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణ పేట, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి.ఇక హైదరాబాద్ లో తేలిపాటి జల్లులు కురిసాయి. అక్కడడక్కడ మోస్తరు వర్షం కురిసింది. గతం మూడు రోజుల్లో భద్రాద్రి కొత్తగుడం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications