గడ్కరీతో కేటీఆర్ భేటీ, మరోసారి విచారణకు వేం నరేందర్ రెడ్డి
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యనటలో బిజీబిజీగా ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలోని రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
దీంతో పాటు తెలంగాణకు జాతీయ రహదార్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరినట్టు తెలుస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణానికి రాయితీ ధరకే సిమెంటును ఇవ్వాలని కేంద్రమంత్రి గడ్కరీని కేటీఆర్ కోరారు. అంతక ముందు హడ్కో చైర్మన్ రవికాంత్‌ను కలిశారు.

మరోసారి విచారణకు నరేందర్ రెడ్డి
ఓటుకు నోటు వ్యవహారంలో బుధవారం విచారణకు హాజరైన టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ అధికారులు కోరారు. ఆయన్ని ఏసీబీ అధికారులు సోమవారం విచారించే అవకాశం ఉంది. ఓటుకు నోటు వ్వవహారంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విచారణ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఏసీబీ విచారణను, తదనంతరం జరిగిన పరిణామాలను గురువారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశమై వివరించినట్లు తెలుస్తోంది.
ఇక ఓటుకు నోటు కేసులో తాజాగా నోటీసులు అందుకున్న టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య కూడా శుక్రవారం సాయంత్రం లోపు విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ అధికారులు సూచించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications