హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రౌండ్ టేబుల్: రైతు ఆత్మహత్యలపై ఎంపీ కవిత ఏమన్నారు? (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆ ఆత్మహత్య ఆ కుటుంబానికే కాదు, తెలంగాణ సమాజానికి సంక్షోభమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, మీకు మేమున్నామని, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రైతు సంక్షేమం - తెలంగాణ రాష్ట్రం అనే అంశంపై రౌండ్‌ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడూతూ పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చకుందామని, మీరులేని బంగారు తెలంగాణకు సార్ధకత లేదని ఆమె అన్నారు.

 రైతు ఆత్మహత్యలపై ఎంపీ కవిత

రైతు ఆత్మహత్యలపై ఎంపీ కవిత


ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలు, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్, జాగృతి కార్యకర్తలు, అందరూ రైతుల కుటుంబాల్ని ఆదుకోవడానికి కలిసి రావాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని చేరుకునేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జాగృతి యువత ప్రతి ఒక్కరూ ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకుని, వారి పిల్లల చదువును కొనసాగించేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు.

 రైతు ఆత్మహత్యలపై ఎంపీ కవిత

రైతు ఆత్మహత్యలపై ఎంపీ కవిత


రైతులెవరూ నిరాశ పడొద్దు. కష్టపడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుందాం. మీరు లేకపోతే బంగారు తెలంగాణ సార్ధకం కాదు అని అన్నారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఎంపీ కవిత వివరించారు. పంటలు ఎండిపోయిన రైతులకు 2009 నుంచి నష్టపరిహారం అందలేదన్నారు. ఈ బకాయిల మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి రూ.480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిందన్నారు.

రైతు ఆత్మహత్యలపై ఎంపీ కవిత

రైతు ఆత్మహత్యలపై ఎంపీ కవిత


గత ఏడాది, ఇటీవలి పంట నష్టాలకు సంబంధించి పరిహారం రావాలన్నారు. బహుశా రెండు, మూడు రోజుల్లో ఆ మొత్తం కూడా విడుదలయ్యే అవకాశముందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా రైతుల రుణ మాఫీ హామీని అమలు చేస్తుంది. ఇప్పటికే రూ.8వేల కోట్లను బ్యాంకులకు చెల్లించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విధానంలో భాగంగా అనుబంధ రంగాల్ని కూడా ప్రోత్సహిందన్నారు.

 రైతు ఆత్మహత్యలపై ఎంపీ కవిత

రైతు ఆత్మహత్యలపై ఎంపీ కవిత

తెలంగాణలో పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం వృద్ధి చెందిందన్నారు. పాలిచ్చే బర్ల కొనుగోలుకు రూ.50వేల చొప్పున మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చిందన్నారు. విత్తనాల రకాలపై విస్తృత పరిశోధనలు కూడా జరుగతున్నాయన్నారు. అయితే వాటికి సంబంధించిన ఫలితాలపై రైతుల్లో నమ్మకం రావాల్సి ఉందన్నారు. ఈ విత్తనాలను రైతులు వినియోగించడం వల్ల తక్కువ ధరకు భరోసా దిగుమతి ఉంటుందన్నారు. ఒకవేళ విఫలమైతే.. ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకుంటుందన్నారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ సామాజికవేత్తలు, వ్యవసాయ పరిశోధకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ప్రభుత్వానికి అవసరమైన అనేక సూచనలు చేశారు. వివిధ అంశాలపై లోతైన విశ్లేషన చేసి ప్రభుత్వం తక్షణం చేయవలసిన వివిధ కార్యక్రమాలను సైతం సూచించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వివిధ సంస్థల ప్రతినిధులు, సామాజికవేత్తల అభిప్రాయాల్ని కూడా ప్రభుత్వం పరిగణిస్తుందన్నారు. ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి ఇప్పుడు రైతులకు భరోసా కల్పించేందుకు ప్రతి ఒక్కరు - ఒక్కో కుటుంబాన్ని దత్తత (ఈచ్ వన్ - అడాప్ట్ వన్) అనే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు.

English summary
telangana jagruthi president kavitha participate in farmers meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X