హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేనలా అనలేను కానీ, మద్దతిస్తా: 'ఆంధ్రుల'పై కవిత (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'మేం ఇంకా ఆంధ్రుల ఆధిపత్యం కిందనే బతకాలా, తెలంగాణ మహనీయుల పాఠాలు వినే స్థితిలో వారు లేనప్పుడు ఆంధ్రా వాళ్ల విగ్రహాలు ఇంకా ఎక్కడెందుకు అని దేశపతి శ్రీనివాస్ చెప్పినట్లు, ఎంపీగా నేను చెప్పలేనని, కానీ ఆ వ్యాఖ్యలకు నా మద్దతు ఉంటుందని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

సోమవారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి, జానపథ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జానపద జాతర ముగింపి ఉత్సవానికి ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

ప్రాంతాలు విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామన్నది తమ నినాదం అని, కానీ ఏపీలోని పాఠ్యపుస్తకంలో వట్టికోట అళ్వార్ స్వామి వంటి మహనీయుడి చరిత్రను తొలగించారని తెలిసిందని, అలాంటప్పుడు ఆ ప్రాంత మనహీయనుల విగ్రహాలు ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు.

తెలంగాణ జానపద జాతర

తెలంగాణ జానపద జాతర

మా పాఠ్యాంశాల్లో నన్నయ్య, జాషువా వంటి వారు ఎందరో ఉన్నారని, మా పిల్లలకు తెలుగు సాహిత్యం అర్థమయ్యేలా అన్ని విషయాలు చెబుతామని కవిత అన్నారు.

 తెలంగాణ జానపద జాతర

తెలంగాణ జానపద జాతర

అస్తిత్వాన్ని నిలబెట్టుకొనే ధైర్యం కల్పిస్తామని, వట్టికోట చరిత్రను తొలగించడం అక్కడి ప్రభుత్వానికే అవమానమని కవిత అన్నారు.

 తెలంగాణ జానపద జాతర

తెలంగాణ జానపద జాతర

దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ... అరవయ్యేళ్లు మీ చరిత్ర చదివామని, ఒక్క ఏడాది మా చరిత్ర చదవలేకపోతున్నారా అని ప్రశ్నించారు.

తెలంగాణ జానపద జాతర

తెలంగాణ జానపద జాతర

ఆంధ్ర పుస్తకాల్లో తెలంగాణ మహనీయుల చరిత్రను తొలగించారని, ఇది సరికాదని దేశపతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ జానపద జాతర

తెలంగాణ జానపద జాతర

జానపద కళాకారులు తమ ఆటాపాటలతో ధూం.. ధాం చేశారు. రవీంద్ర భారతి వేదికగా కొమ్ముకోయ, గుస్సాడి, నందికోల, యక్షగానం, ఒగ్గుడోలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రదర్శించారు.

English summary
Telangana Janapada Jatara pictures
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X