వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana Job Notifications : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఎట్టకేలకు ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం(జులై 9) అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 50వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. ఆయా శాఖల్లో పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలని సూచించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉద్యోగ ఖాళీల భర్తీపై సీఎం కేసీఆర్ చర్చించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందన్నారు. అత్యంత శాస్త్రీయంగా రూపొందించిన ఈ విధానానికి కేంద్రం నుంచి అనుమతి లభించడంలో జాప్యం జరిగిందన్నారు. మొదటి దశలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 50వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలన్నారు.

telangana job notifications cm kcr orders to fill vacancies in govt departments

తెలంగాణలో జోనల్ వ్యవస్థలో మార్పులు,చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లతో అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలతో పాటు స్థానికులకు ప్రయోజనం చేసేలా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు.

నిజానికి గతేడాది డిసెంబర్‌లోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. త్వరలోనే మొదటి దశ ద్వారా 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతామని తెలిపింది. కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు,నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగాల అంశంపై ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో ఉద్యోగాల భర్తీ ప్రకటన ఎన్నికల స్టంట్ అన్న విమర్శలు వినిపించాయి. అయితే ప్రభుత్వం మాత్రం జోనల్ వ్యవస్థలో మార్పులకు కేంద్రం ఆమోదం తెలపకపోవడం వల్లే నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయని చెబుతూ వచ్చింది.

ఇదే క్రమంలో ఏప్రిల్ 20న కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఆ గెజిట్ విడుదలై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్లకు సిద్దమవుతుండటం నిరుద్యోగులకు కాస్త ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి ఏజ్ బార్ అయినవాళ్లున్నారు. వారి కోసం ప్రభుత్వం ఏమైనా సడలింపులు ఇస్తుందా... లేదా అన్నది వేచి చూడాలి.

English summary
Telangana Jobs notifications-Good news for the unemployed in Telangana ... Job notifications are finally coming. Chief Minister KCR on Friday (July 9) directed the authorities to immediately start the process of filling the vacancies in government departments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X