Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుడ్ న్యూస్.. ఇకపై వారికి ప్రతినెలా రూ. 1000.. ఆ రోజు నుంచే ప్రారంభం

రాష్ట్రంలోని మహిళలు, రైతుల అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. తాజాగా రాష్ట్రంలోని నిరుద్యోగులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నియామకాలు, నిధులు.. అంశాలపైన. ఈ క్రమంలో రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతీయువకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రతి నెలా రూ. 1000 ఇవ్వనుంది. అలాగే ఉచితంగా కోచింగ్ కూడా ఇవ్వనుంది. మీరు చేయాల్సిందల్లా రోజూ కోచింగ్ కు అటెండ్ కావడమే. అలా శిక్షణకు హాజరయ్యే ఉద్యోగార్థులకు ప్రతి నెలా రూ. 1000 అందించనుంది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణలోని గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో గ్రూప్-1 నుంచి బ్యాంకింగ్.. తదితర పరీక్షలకు ఉచితంగా శిక్షణ కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. 150 రోజుల పాటు జరిగే ఈ కోచింగ్‌ కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1000 స్టైఫండ్ కూడా ఇవ్వనున్నారు అధికారులు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్స్, ఆర్‌ఆర్‌బి, ఎస్‌ఎస్‌సి, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్‌లకు ఫౌండేషన్ కోర్సు ఉచిత కోచింగ్ ప్రోగ్రాం అందించనున్నారు.

Telangana Launches Free Coaching for Groups RRB SSC and Banking in 12 BC Study Circles

ఆగస్టు 25 నుంచి 150 రోజుల పాటు కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి ఇటీవల తెలిపారు. అర్హులైన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఈ నెల 16 నుంచి ఆగస్టు 11 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1000 చొప్పున ఐదు నెలల పాటు స్టైఫండ్ ఇస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్ సర్కార్‌ ఇటీవల గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. తద్వారా లక్ష మంది నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామన్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+