పెట్రోల్, డీజిల్ ధరలు: ప్రధానికి 9పైసల చెక్కు పంపాడు
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వాహనదారులు ఆగ్రహానికి గురవుతున్న విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు పెరిగితే దాని ప్రభావంతో ఇతర నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయని సామాన్య ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూపాయల్లో పెట్రోలు ధరలు పెంచేసి, ఇప్పుడు పైసల్లో తగ్గిస్తుండడం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. కేంద్ర సర్కారు తీరుకి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందు గౌడ్ అనే ఓ వ్యక్తి.. ప్రధాని నరేంద్ర మోడీకి 9 పైసల చెక్కు పంపాడు.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు ఆ చెక్కును అందించాడు. ఇటీవల పెట్రోల్ ధరలను 9 పైసలు తగ్గించారని, అందుకే తాను ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు 9 పైసలు విరాళంగా ఇస్తున్నానని పేర్కొన్నాడు. తాను చేసిన ఈ ఆర్థిక సాయంతో ధనవంతులకు సాయం చేయాలని కోరడం గమనార్హం.












Click it and Unblock the Notifications