తెలంగాణ పాలపిట్ట కేసీఆర్: మంత్రి హరీష్ రావు
తెలంగాణ పాలపిట్ట సీఎం కేసీఆర్ అని పాలపిట్టను చూడడం దసరా రోజున శుభ సూచకం కాబట్టి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి శుభసూచకమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలో సంక్షేమ అభివృద్ధి పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సంగారెడ్డిలో బీఆర్ఎస్ నాయకుడు, డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యం నివాసంలో ఈరోజు పార్టీ శ్రేణులతో సమావేశమై అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఒకవైపు, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వారు మరోవైపు ఉన్నారని తేల్చుకోవాల్సింది ప్రజలేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

ఓటుకు నోటు నోటుకు సీటు అనేవాళ్ళు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ప్రశ్నించారు. కర్ణాటక రైతులు తాము ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వేశామని తిడుతున్నారన్నారు.
మతం మంటలు పెట్టే చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, దేశంలో కరెంటు కోతలు ఉంటే, మనం నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ధరణి వద్దు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థు తెస్తారా..? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ధరణిలో లోపాలు ఉంటే సరి చేస్తాం అని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ నాయకుల ఆరోపణల పై మండిపడ్డారు.
రాహుల్ గాంధీ కంప్యూటర్ మా నాన్న తెచ్చాడు అన్నారు..ఇప్పుడు మేం చేసేంది కంప్యూటరీకరణ అని హరీష్ రావు పేర్కొన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలతో సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరవేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. పార్టీకి పనిచేసే వారికి అందరికీ పదవులు ఇచ్చి ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications