చెరువులో పడ్డ తెలంగాణా మంత్రి.. తృటిలో తప్పిన ప్రమాదం!!
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫాబాద్ ఊరి చెరువు వద్ద జరుగుతున్న చెరువుల పండుగ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ ని బీఆర్ఎస్ కార్యకర్తలు పడవ ఎక్కాలని కోరడంతో నాటు పడవ ఎక్కబోయారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ నాటుపడవ ఎక్కిన క్రమంలో చెరువులో పడిపోయారు. మంత్రి ఎక్కిన పడవ బోల్తా పడి ఆయన నీళ్ళల్లో పడిపోయారు.వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆయనను నీళ్ళలో నుండి సురక్షితంగా ఆయనను బయటకు తీసుకువచ్చారు. చెరువు లోతు ఎక్కువగా లేకపోవడం వల్ల ఆయనకు పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. మంత్రి గంగుల కమలాకర్ కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే ప్రతిరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో మంత్రి గంగుల కమలాకర్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిన్న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించుకోబోతున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనులను పరిశీంచిన అనంతరం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
మంత్రి గంగుల ప్రజా ప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులతో కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం పై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈనెల 21న కేబుల్ బ్రిడ్జి ప్రారంభించనున్నామని, ప్రారంభానికి రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ రానున్నారని తెలిపారు.
గంగుల కమలాకర్ కు తృటిలో తప్పిన ప్రమాదం#GangulaKamalakar #BRSMLA #TelanganaNews #Oneindiatelugu pic.twitter.com/aebkct7sAr
— oneindiatelugu (@oneindiatelugu) June 9, 2023
కమాన్ నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా సదాశివపల్లి వరకు రోడ్డు పనులు పూర్తయినందున లైటింగ్ ను ఏర్పాటు చేయాలని , డైనమిక్ లైట్ల్, క్రాకర్ షో, లేజర్ షో మరియు కేబుల్ బ్రిడ్జి ప్రారంభాన్ని ప్రణాళిక ప్రకారం అద్బుతంగా చెయ్యాలని సూచించారు. కేబుల్ బ్రిడ్జి లోగోను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications