ముంపు గ్రామాలపై హరీష్, 'కేసీఆర్‌ది తుగ్లక్ పాలన'
హైదరాబాద్: పులిచింతల ముంపు గ్రామాల సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి హరీష్‌రావు. ఈ సమావేశంలో నల్లగొండ జిల్లాల్లో 13 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు.
నల్లగొండ జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలకు రూ.130 కోట్లు నష్టపరిహారం రావాల్సి ఉందని తెలిపారు. ఈ మొత్తంలో రూ.40 కోట్లు తక్షణమే చెల్లించడానికి ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అంగీకరించారని వెల్లడించారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమాతో కూడా మాట్లాడామని చెప్పారు.
ముంపు గ్రామాల ప్రజల సమస్యలను తక్షణమే తీర్చాలని కోరామన్నారు. నాగార్జునసాగర్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్‌ను అమ్మివేస్తామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో చెరువుల పునురుద్దరణను ఒక ఉద్యమంలా చేపడతామన్నారు.

త్వరలో ఇరిగేషన్ అధికారులకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన తెలుగుదేశం నేతలు
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా మార్కెట్ యార్డుల్లో రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ కల్పిస్తున్నారో చూపించాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు తెలుగుదేశం నేతలు. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కరపత్రాలతో ప్రజలను మభ్యబెడుతుందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్దత తెలిసి కూడా మంత్రులు ఎవరూ నోరు మెదపడం లేదని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రప్రభుత్వాలపై విమర్శలకే కేసీఆర్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తుగ్లక్ పాలన మాదిరి కేసీఆర్ పాలన ఉందని ఎద్దేవా చేసారు.
ఇక నుంచైనా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం మానుకోవాలని తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సీనియర్ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications