హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెటిఆర్ ఔదార్యం:వాట్సాప్ లో మంత్రికి మేసేజ్, ఉచితంగా ఆపరేషన్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్ కు వాట్సాప్ లో మేసేజ్ పెట్టి తన ధైన్య పరిస్థితిని వివరించాడు ఓ టిఆర్ఎస్ వి నాయకుడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:తన సోదరికి అత్యవసర చికిత్స ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఆసుపత్రి యాజమాన్యం నాలుగు లక్షలను చెల్లించాలని కోరుతున్నారు.కాని, అంత సొమ్ము మా వద్ద లేదు. మేం చాలా నిరుపేదలం. తమకు సహయం చేయాలని తెలంగాణ మంత్రి కెటిఆర్ ను కోరాడు.ఈ మేసేజ్ కు మంత్రి కెటిఆర్ స్పందించాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన గుగ్గిళ్ల రాజు టిఆర్ఎస్ వి నాయకుడు.ఆయన సోదరి ఎనిమిది మాసాల గర్భిణీ, ఆమెకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు.

ఈ మేరకు యశోధ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు.అయితే ఆసుపత్రి యాజమాన్యం నాలుగు లక్షల రూపాయాలను చెల్లిస్తేనే అవసరమైన శస్త్రచికిత్స చేయిస్తామని యశోద యాజమాన్యం చెప్పింది.

Telangana minister KTR responded on whats app message

దీంతో రాజు తన పరిస్థితిని వాట్సాప్ లో మంత్రి కెటిఆర్ కు పెట్టాడు. యశోదా ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడాలని రాజు కోరారు.అయితే రాజుకు మంత్రి వాట్సాప్ లో సమాధానమిచ్చాడు.

మంత్రి కెటిఆర్ ఇచ్చిన హమీతో ఆయన ఆసుపత్రిలో తన సోదరిని చేర్పించాడు. ఆసుపత్రి యాజమాన్యం కూడ రాజును చిల్లిగవ్వ కూడ అడగలేదు. అంతే కాదు రాజు సోదరికి ఆపరేషన్ చేసి ప్రాణాలను కాపాడారు.

అయితే మంత్రిని కలిసే అవకాశం లేకపోవడంతోనే వాట్సాప్ లోనే మంత్రికి మేసేజ్ పెట్టానని రాజు చెబుతున్నాడు. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు సచివాలయంలో ఆయన మంత్రిని కలిశారు. ఖర్చుల విషయాన్ని కూడ తాను చూసుకొంటానని మంత్రి హమీ ఇచ్చారని రాజు ఆనందంతో చెబుతున్నాడు.

English summary
Telangana minister KTR responded on whats app message .siricilla district trsv leader urged minister KTR on Whatsapp for free treatment at Yashoda hospital in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X