వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా మంత్రుల్లారా, నోరు జారితే ఖబడ్దార్: మంత్రి మహేందర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రా మంత్రుల్లారా.. నోరుజారితే ఖబడ్దార్! అని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్‌స్టేషన్లను హైదరాబాద్‌లో, తెలంగాణలో ఏర్పాటు చేస్తామంటే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరని, అలా ఊరుకునేందుకు తామేమీ గాజులు తొడుక్కొని కూర్చోలేదని అన్నారు.
అలాంటి చర్యలకు పాల్పడితే తరిమికొడుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు వ్యవహారంలో నిలదీయాలని ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సూచించారు. తప్పుచేసిన బాబు జైలుగోడలు లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు, కిషోర్‌బాబు తమ నాయకుడు కే చంద్రశేఖర్‌రావును ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. నేడు రాష్ట్ర గవర్నర్‌ను తప్పుబడుతున్న చంద్రబాబు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనను పొగడలేదా? అని మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.

సెక్షన్ 8పై బాబుకు అవగాహన లేదు...

Telangana Minister Mahender Reddy warns Andhra ministers

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, చంద్రబాబు వందిమాగధులకు సరైన అవగాహనలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే యాదవరెడ్డి అన్నారు .బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీలు జగదీశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రజల ఆస్తులు, హక్కులు, ప్రాణాలకు ముప్పు ఏర్పడిన పక్షంలోనే గవర్నర్ జోక్యం చేసుకోవచ్చని ఈ సెక్షన్ చెబుతున్నదన్నారు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం హైదరాబాద్‌లో లేవని, పైగా ఇక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని, సెక్షన్-8 అమలు జరగదని ఆయన స్పష్టం చేశారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం తగదని, అలాంటి ప్రయత్నాలకు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు వెంటనే స్వస్తి పలకాలని సూచించారు.

వాయిస్ చంద్రబాబుదా, కాదా...

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసు నుంచి తప్పించుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని టీఆర్‌ఎస్ నేత పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్టీఫెన్‌సన్ తనను డబ్బుతో ప్రలోభపెడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌ను పట్టుకున్నారని ఆయన గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కేసులో రికార్డయినట్టు చెబుతోన్న వాయిస్ చంద్రబాబుదేనా కాదా? చెప్పాలని పాతూరి డిమాండ్ చేశారు.

అలాగే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు కూడా తమవేనా కాదా? చెప్పాలని అన్నారు. ఈ కేసులో సీఎం కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మంగళగిరి సభలో ప్రజలను చేతులెత్తి చెప్పండని చంద్రబాబు అనడం సరికాదన్నారు. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబుకు పదవిలో కొనసాగే అర్హతలేదన్నారు. రికార్డయిన వాయిస్ తనదేనని చెప్పి చంద్రబాబు నాయుడు పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Telangana transport minister Mahender Reddy has warned Andhra Pradesh ministers for criticising Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X