పంట పొలంలో ఫ్లెక్సీ: బ్యాంకు అధికారులకు మంత్రి తుమ్మల వార్నింగ్
నిజామాబాద్ డీసీసీబీ బ్యాంకు అధికారులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంతో రైతుల భూమిలో బ్యాంకు ఫ్లెక్సీలు పెట్టి వేలం వేస్తామని రైతులను హెచ్చరించారు. కొందరి రైతుల భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. ఈ వివాదంపై ఆరా తీశారు. బ్యాంకు అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించారు. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఇతరులకు విక్రయిస్తుండటం వల్లే అలా పెట్టాల్సి వచ్చిందని బ్యాంకు అధికారులు స్పందించగా మంత్రి ఘాటుగా స్పందించారు. ఇలా ప్లెక్సీలు పెట్టడం లాంటి పద్ధతులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.

ఈ వ్యవహారం గురించిన వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేట్ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతు 2010లో డీసీసీబీ (డిస్టిక్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్)లో రూ.5లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. కొన్ని వాయిదాలు చెల్లించి ఆపేశాడు. భూమి మీద తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంక్ అధికారులు రైతుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. రైతు నుంచి సమాధానం రాకపోవడంతో బహిరంగ వేలం వేస్తామని లింగంపేట ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
అయితే, రుణం తీసుకుని పది, పదిహేను సంవత్సరాలు అయ్యి వడ్డీలు పెరిగిపోయాయని, తీసుకున్న రూ.5 లక్షలు రుణానికి రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు రైతులు తెలిపారు. ఇప్పుడు ఇంత మొత్తం చెల్లించడం భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. వడ్డీ తగ్గించాలని బ్యాంకు అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారు తీసుకున్న రుణాల వడ్డీలను ప్రభుత్వం మాఫీ చేయాలని కోరుతున్నారు. పొలంలో ఫ్లెక్సీలతో పాటు ఎర్రజెండాలను ఏర్పాటు చేయడంతో రైతులు మండిపడుతున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications