మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్, బీజేపీ యాక్షన్ ప్లాన్ ఇదేనా..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52.43 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల సమరానికి అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు పూర్తి ప్రణాళికతో కార్యాచరణను రూపొందిస్తున్నాయి.
అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, నితిన్ నబిన్ రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్ నగర్ లో నితిన్ నబిన్ సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్ లో అమిత్ షా సభ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి దక్షిణ తెలంగాణలో ఒక సభ, ఉత్తర తెలంగాణలో ఒక సభ పెట్టే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఆశించినంత ప్రభావం చూపలేకపోయింది. అప్పుడు 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా కాషాయ పార్టీ కేవలం రెండు మున్సిపాలిటీలు అవికూడా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని మక్తల్, ఆమనగల్ లో మాత్రమే విజయం సాధించింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్స్ ఎన్నికల్లో మాత్రమే బీజేపీ ప్రభావం చూపగలిగింది. మరి ఈసారి ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి.
ఇక మున్సిపల్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. తిరిగి స్వదేశానికి రాగానే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్ లో సీఎం రేవంత్ పర్యటించనున్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 890 మంది అభ్యర్థుల నుంచి 902 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక వీరిలో 382 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 258 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులు, 169 మంది బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. అలాగే ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
-
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications