ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు -కొవిడ్ నిబందనల మధ్య కౌంటింగ్ షురూ

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్‌ కొవిడ్ నిబంధనల మధ్య సాగుతున్నది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికలకు కౌంటింగ్ సందర్భంగా ఈసీ కఠిన నిబంధనలు విధించింది. కొవిడ్ నెగటివ్ రిపోర్టులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ హాళ్లలోకి అనుమతిస్తున్నారు.

దీదీకి ఈసీ షాక్: నందిగ్రామ్ రీకౌంటింగ్ లేదు -రాత్రికి మమత రాజీనామా, కొత్త సీఎంకు గవర్నర్ సిఫార్సు?దీదీకి ఈసీ షాక్: నందిగ్రామ్ రీకౌంటింగ్ లేదు -రాత్రికి మమత రాజీనామా, కొత్త సీఎంకు గవర్నర్ సిఫార్సు?

బీజేపీ గెలుపుతో జగన్ చేతికి అస్త్రం -అడకత్తెరలో కేంద్రం -ఏపీలో మళ్లీ హోదా ఉద్యమం? వైసీపీ గేమ్!బీజేపీ గెలుపుతో జగన్ చేతికి అస్త్రం -అడకత్తెరలో కేంద్రం -ఏపీలో మళ్లీ హోదా ఉద్యమం? వైసీపీ గేమ్!

66 డివిజన్లున్న గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి ఓట్లను నగర శివారులోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో లెక్కిస్తున్నారు. 60 డివిజన్లున్న ఖమ్మం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపు ఎస్‌ఆర్‌ అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో చేపట్టారు.

Telangana Municipal Elections results 2021: counting Begins amid COVID-19 protocols

అచ్చంపేట మున్సిపల్‌ లెక్కింపు.. జేఎంజే హైస్కూల్లో, జడ్చర్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు బీఆర్​ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, కొత్తూరు మున్సిపల్ కౌంటింగ్ కేజీబీవీ స్కూల్లో, సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికలు ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీలోని లింగోజీగూడ డివిజన్‌ ఉప ఎన్నిక ఓట లెక్కింపు సరూర్‌నగర్‌ వీఎం హాలులో నిర్వహిస్తున్నారు.

English summary
The counting of votes for the municipals and corporations in Telangana has began on monday. counting for Khammam, Warangal Corporations and Siddipet, Atchampet, Nakirekal, Jadcherla and Kothuru municipalities under way. The Election Commission made all arrangements for the counting of votes following the COVID-19 protocols.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X