హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్‌పై ఛార్జ్‌షీట్: ఏడేళ్ల కిందటి కేసులో ఏ1గా: నాంపల్లి కోర్టు సమన్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి న్యాయస్థానం మరోసారి సమన్లను జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఏడేళ్ల కిందటి కేసుకు సంబంధించిన సమన్లు ఇవి. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన న్యాయస్థానానికి విజ్ఙప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలా? లేదా? అనేది ఈ కేసు తీవ్రత ఆధారంగా న్యాయస్థానం తీసుకోవచ్చని చెబుతున్నారు.

బీజేపీ-జనసేన మధ్య బీసీ ముఖ్యమంత్రి చిచ్చు: జన సైనికుల ఆశలు ఆవిరేనా?బీజేపీ-జనసేన మధ్య బీసీ ముఖ్యమంత్రి చిచ్చు: జన సైనికుల ఆశలు ఆవిరేనా?

20214 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్.. 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రచారాన్ని నిర్వహించారంటూ ఆయనపై కేసు నమోదైంది. అప్పట్లో కోదాడ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. జాతీయ రహదారి మీద ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా చార్జ్‌షీట్‌‌ను దాఖలు చేశారు. ఈ కేసులో జగన్‌‌ను ఎ1 చేర్చారు.

 Telangana: Nampally Court issued Summons to AP CM YS Jagan to attend Feb 12

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో మిగిలిన ఎ2, ఎ3గా ఉన్న వారిపై కేసులను కొట్టేసింది న్యాయస్థానం. వారు వ్యక్తిగతంగా న్యాయస్థానానికి హాజరు కావడం, వివరణ ఇవ్వడంతో కేసును కట్టేసింది. తాజాగా ఇదే కేసులో ఎ1 ఉన్న వైఎస్ జగన్‌ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఫలితంగా నాాంపల్లి న్యాయస్థానం సమన్లను జారీ చేసింది. ఈ నెల 12 న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరేలా ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తారని అంటున్నారు.

English summary
Nampally Court in Hyderabad, Telangana, has issued the summons to the AP Chief Minister YS Jagan Mohan Reddy for conducted election rally against the Code of Conduct at the time of 2014 general elections in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X