హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహాకూటమి నేతల భేటీ: సీట్ల చర్చ జరగలేదన్న ఉత్తమ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి నేతలు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కామన్‌ పోగ్రాం అజెండాపై చర్చించామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌, తెలంగాణ జన సమతి, టీడీపీ, సీపీఐ పార్టీల కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో కామన్‌ అజెండా ఫైనల్‌ చేసి, ఆ తర్వాత విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు సీట్ల చర్చ జరగలేదని వివరించారు.

Telangana opposition leaders meeting for mahakutami

కేసీఆర్‌ ఏం చేసినా ఓటమి ఖాయమన్నారు. నోటిఫికేషన్‌ వచ్చే నాటికి సీట్ల సర్దుబాటు ఫైనల్‌ అవుతుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూలే ఇంకా ప్రకటించలేదు..సీట్లు, మేనిఫెస్టో గురించి తొందరపాటు ఎందుకని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. వివిధ పార్టీల నేతలతో కలిసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

English summary
Telangana opposition leaders met for discuss on mahakutami on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X