ముగిసిన పంచాయతీ ఎన్నికలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. చివరి దశలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ విడతలో భాగంగా 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది, అలాగే వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా మూడో విడతలో భాగంగా 80.78శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మూడో విడతలో 3,752 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటివరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1,502 స్థానాల్లో గెలుపొందారు. అలాగే బీఆర్ఎస్ 866, బీజేపీ 163, ఇతరులు 325 చోట్ల విజయం సాధించారు. ఇక 26 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్, సిద్ధిపేట, సిరిసిల్ల, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. అటు జనగామ, యాదాద్రి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ నెలకొంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇక డిసెంబర్ 11న జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం నమోదు కాగా.. డిసెంబర్ 14న జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా 85.86 శాతం పోలింగ్ నమోదైంది. తొలిదశలో 4,227 స్థానాలకు ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2,331 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే బీఆర్‌ ఎస్ 1,168 స్థానాల్లో గెలుపొందింది. అలాగే బీజేపీ 189 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 539 స్థానాల్లో గెలుపొందారు.

అలాగే రెండో దశలో 4325 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 2245 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే బీఆర్‌ ఎస్ 1,188 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 268 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 624 స్థానాల్లో విజయం సాధించారు.

ఇక మూడో విడతలో మొత్తం 4,107 స్థానాలకు గాను.. ఇప్పటివరకూ కాంగ్రెస్ 2230 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే బీఆర్ఎస్ 1151 స్థానాల్లో గెలుపొందింది. ఇక బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 487 స్థానాల్లో గెలుపొందారు. ఇక మొత్తం గ్రామ పంచాయితీలు 12,727 ల్లో ఇప్పటివరకు వెలువడిన 12,660 స్థానాలకు గాను.. కాంగ్రెస్ పార్టీ 6,806 స్థానాలు, బీఆర్ఎస్ 3,506 స్థానాలు, బీజేపీ 697 స్థానాలు, ఇతరులు 1650 స్థానాల్లో విజయం సాధించారు.

Telangana Panchayat Elections 2025 Congress Sweeps Final Phase Wins Majority Again

ఇక రాష్ట్రంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌ లు డిసెంబర్‌ 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముందుగా డిసెంబర్ 20 అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల ఆ తేదీని రద్దు చేశారు. దాంతో డిసెంబర్‌ 22ను అపాయింటెడ్ తేదీగా ఖరారు చేసింది పంచాయతీ రాజ్ శాఖ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+