Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గల్ఫ్ దేశాల్లో భయం గుప్పిట్లో తెలంగాణా వాసులు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మంత్రి భరోసా!

ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయిల్ కలిసి చేస్తున్న దాడులలో ఇరాన్ లో ఇప్పటివరకు 555 మంది మరణించారు. ముఖ్యంగా ఇరాన్ ఇరాన్ సర్వ అధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవటంతో ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయిల్ తో పాటు వారికి సహకరించిన దేశాలపైన కూడా ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది.

తెలంగాణ భవన్‌లో 24గంటల కంట్రోల్ రూమ్

దీంతో గల్ఫ్ దేశాలు తాజా పరిణామాలతో ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దాడులు తక్షణమే ఆపాలనే, లేదంటే తమను తాము కాపాడుకోవటానికి అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటామని, దూకుడుగా ప్రతిస్పందించగలం అంటూ పేర్కొంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న తెలంగాణ పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

Telangana people in gulf countries Anxious Over War Minister Adluri Laxman Responds control room for help

ఇబ్బందుల్లో ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి

విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రభుత్వం అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. ఇబ్బందుల్లో ఉన్న వారు, వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం వందన బరువా - 9871999044, చక్రవర్తి - 9958322143, జావేద్ హుస్సేన్ - 9910014749, రక్షిత్ నాయక్ - 9643723157 మొబైల్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చునని పేర్కొంటున్నారు.

తెలంగాణా వాసులు ఆందోళన వద్దన్న మంత్రి అడ్లూరి

ప్రయాణ అంతరాయాలు, ఇతర అత్యవసర సమయాల్లో అవసరమైన సమన్వయం, సహాయాన్ని అందించేందుకు ఈ బృందం అందుబాటులో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రంతో కలిసి పౌరుల క్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలంగాణ సర్కార్ భరోసా ఇచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్త్థితుల నేపధ్యంలో అక్కడ ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలంగాణా వాసులు ధైర్యంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

అవసరమైన సహాయం చేస్తాం అన్న మంత్రి అడ్లూరి

గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణా వాసుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, కేంద్రంతో నిరంతరం సంప్రదిస్తుందని తెలిపారు. అక్కడున్న వారు తమ యోగక్షేమాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు, అధికారులకు తెలియజేయాలని సూచించారు. నిరంతర సమీక్షల ద్వారా తెలంగాణ పౌరులకు అవసరమైన సహాయం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+