హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ పీజీఈ-సెట్, లాసెట్, పీజీ లాసెట్ షెడ్యూల్ విడుదల: పూర్తి వివరాలు ఇవే

ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈ-సెట్ 2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1వ తేదీన టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈ-సెట్ 2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1వ తేదీన టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ సంయుక్తంగా విడుదల చేశారు.

మార్చి 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ. 500 ఆలస్య రుసుముతో మే 8వ తేదీ వరకు, రూ. 2500తో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి 12వ తేదీ వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Telangana PGEcet 2023 schedule released

మే 15 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చ. మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం https://tsecet.nic.in/ ను సంప్రదించవచ్చు.

టీఎస్ లాసెట్-2023, పీజీ లాసెట్ షెడ్యూల్ విడుదల

మరోవైపు, టీఎస్ లాసెట్-2023 షెడ్యూల్ కూడా విడుదలైంది. మార్చి 1న లాసెట్, పీజీ లాసెట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 600గా దరఖాస్తు ఫీజు నిర్ధారించారు. రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ. 1000తో ఏప్రిల్ 19 వరకు, రూ. 2000తో ఏప్రిల్ 26 వరకు, రూ. 4వేలతో మే 3వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 5 నుంచి 10వ తేదీ వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ లా సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ లాసెట్ ప్రవేశ పరీక్షను ఆన్ లైన్లో నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం https://lawcet.tsche.ac.in/ సంప్రదించవచ్చు.

English summary
Telangana PGEcet 2023 schedule released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X