తెలంగాణలో మళ్లీ పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ? పోలీసుల క్లారిటీ..
తెలంగాణలో గతంలో ఎప్పటి నుంచో పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం మరోసారి డిస్కౌంట్ పై చెల్లించే అవకాశం కల్పిస్తోందంటూ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. గతంలో ఓసారి ఇలాగే పెండింగ్ లో ఉన్న చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ చేయడం, దానికి వాహనదారుల నుంచి భారీగా స్పందన రావడం, ఈ నేపథ్యంలోనే ఈ ఆఫర్ ను మళ్లీ మళ్లీ పొడిగించడం కూడా చేశారు. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా సమకూరింది. దీంతో మరోసారి ఈ ఆఫర్ పెట్టబోతున్నారనే ప్రచారం సాగుతోంది.
తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్లపై మరోసారి డిస్కౌంట్ తో చెల్లించే ఆఫర్ ఇవ్వబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై పోలీసుశాఖ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం నమ్మొద్దని ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పేశారు. ఇలాంటి ప్రచారాల్ని వాహనదారులు నమ్మొద్దని ఆయన కోరారు. తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపుపై ఏ సమాచారం ఉన్నా అధికారిక వెబ్ సైట్ లోనే ఉంచుతామన్నారు.

తెలంగాణలో పెండింగ్ వాహన చలాన్ల సంఖ్య గతంలో భారీగా ఉండేది. ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చాక అది కొంత మేర తగ్గింది. అయితే దీని వల్ల వాహనదారుల్లో నిర్లక్థ్యం కూడా పెరిగింది. దీంతో ప్రభుత్వం ప్రస్తుతానికి పెండింగ్ చలాన్లు కట్టి తీరాల్సిందేనంటోంది. దీనిపై ఇప్పట్లో ఎలాంటి డిస్కౌంట్లూ ఇచ్చే ప్రశ్నే లేదని చెబుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం పోలీసులే స్వయంగా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఫేక్ ప్రచారాలకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.












Click it and Unblock the Notifications