నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ పోలీసులకు ఏమైంది ? మరో సీఐ వైరాగ్యం... అలర్టైన పోలీస్ బాస్!

|
Google Oneindia TeluguNews

ఆయనొక పోలీస్ అధికారి , ముప్పై ఏళ్ల సర్వీసు, అయినా ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేయలేని నిస్సహయత, ఇంకా ఉద్యోగంలో కొనసాగితే ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందని ఆవేదన , ఆయన ఆవేదన బహిర్గతమైంది. దీంతో బతికి బట్టకట్టాడు, అధికారులు అప్రమత్తమై సదరు అధికారిని మరి భద్రతతో సెలవుపై ఇంటికి పంపారు.

వేధింపులకు గురైన రుద్రూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్

వేధింపులకు గురైన రుద్రూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్

దేశంలోనే తెలంగాణ పోలీసులకు అంత్యంత స్వేఛ్చనిచ్చి విధులు నిర్వహింప చేస్తున్నారనే భావన ప్రజల్లో ఉంది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం గతాని కంటే కాస్త మెరుగైన వసతులు పోలీసులకు కల్పించడం తోపాటు వారి జీతభత్యాలను సైతం పెంచింది. దీంతో ఆ ఉద్యోగంలో చేరేందుకు చాలమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఓవైపు నిరుద్యోగులు మాత్రం పోలీస్ ఉద్యోగం పై ఆమితాసక్తిని కనబరుస్తుంటే మరోవైపు ఉద్యోగం చేస్తున్న సీనియర్ అధికారులు మాత్రం మాకోద్దుబాబు ఈ ఉద్యోగం అంటున్నారు. ఒక దశలో పై అధికారు ఒత్తిళ్ల వల్ల ఆత్మహత్య చేసుకోవల్సి వస్తుందని చెబుతున్నారు.

వేధింపులు భరించడం కంటే చావే శరణ్యం

వేధింపులు భరించడం కంటే చావే శరణ్యం

''ప్రతి క్షణం వేధింపులతో బతకడం కంటే..ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదనిపిస్తోంది. నా చావు అయినా కొందరి అధికారుల కళ్లు తెరిపిస్తే ఈ జన్మకు ఇదే సార్థకత " ఇవి ఓ మాములు మనిషి అన్న మాటలు కావు, ఏకంగా పోలీస్ శాఖలో ముప్పై సంవత్సరాలు సర్వీసు అందించిన సర్కిల్ ఇన్సెక్టర్ పోస్టు చేసిన వ్యాఖ్యలు, కొద్ది రోజుల్లో పదోన్నతి సైతం అందుకునే అధికారి అందోళనతో చెప్పిన మాటలు.

అధికారుల వేధింపులంటూ, వాట్సప్ గ్రూప్ లో సీఐ వ్యాఖ్యలు పత్యక్షం

అధికారుల వేధింపులంటూ, వాట్సప్ గ్రూప్ లో సీఐ వ్యాఖ్యలు పత్యక్షం

నిజామాబాద్ జిల్లాకు బోధన్ డివిజన్ లో ఉన్న రుద్రూరు సీఐ దామోదర్ రెడ్డి గత ముప్పై సంవత్సరాలుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడు. అయితే తాను పై అధికారుల వేధింపులు తట్టుకోలేక పోతున్నానట్టు , ఈ వేధింపులతో బలహిన క్షణంలో చనిపోవడమే శరణ్యమంటూ వాట్సప్ లో మెసెజ్ పెట్టాడు. దీంతొ ఆయన వ్యాఖ్యలు దావానంలా వివిధ గ్రూపుల్లో వ్యాప్తి చెందాయి. దీంతో సీఐని ఏవరు వేధించారు అనే ప్రశ్నలు పోలీస్ వర్గాల్లో కలకలాన్ని రేకెత్తిస్తున్నాయి. పోలీస్ శాఖలో ఉన్న వేధింపులపై తీవ్ర ఆందొళనలు వ్యక్తం అవుతున్నాయి. సిఐ స్థాయిలో ఉన్న అధికారికి ఏం జరిగి ఉంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

ఉన్నతాధికారులకు చేరిన వాట్సప్ మెసెజ్, చర్యలు చేపట్టిన అధికారులు

ఉన్నతాధికారులకు చేరిన వాట్సప్ మెసెజ్, చర్యలు చేపట్టిన అధికారులు

సిఐ దామోదర్ రెడ్డి పెట్టిన వాట్సప్ పోస్ట్ పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులకు చేరాయి. దీంతో అప్రత్తమైన అధికారులు వెంటనే దామోదర్ రెడ్డిని పిలిపించి మాట్లాడారు. తక్షణమే ఆయనకు నాలుగు రోజులు సెలవు ఇచ్చారు. మరోవైపు మానసిక ఆందోళనలో ఉన్న దామోదర్ రెడ్డికి భద్రతను ఇచ్చి ఇంటికి పంపారు. ఇక ఆయనపై జరిగిన వేధింపులు ఏమిటి అనేది పోలీసులు అధికారులు విచారణ జరుపుతున్నారు.

English summary
Nizamabad ci faces Harassments from higher officials ,ci posted his comments in watsapp , official takes immediate action on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X