లాక్‌డౌన్ లో సీజ్ చేసిన వెహికల్స్ విడుదల..!ఛలాన్లు చెల్లిస్తే తిరిగిచ్చేయడానికి రెఢీ పోలీసులు..!
హైదరాబాద్ : లాక్‌డౌన్ ఆంక్షలను కాదని మీ సొంత ద్విచక్ర వాహనం వేసుకుని రయ్ రయ్ మని రోడ్ల మీదకు వెల్లారా..? పోలీసులు అంతే వేగంతో మీ వాహనాన్ని సీజ్ చేసారా..? ఇప్పుడెలారా దేవుడా అని బాధ పడుతున్నారా..? ఇక మీకు ఆ బాధ అవసరం లేదు. లాక్‌డౌన్ ఆంక్షల్లో సీజ్ చేసిన మీ వాహనాన్ని తిరిగి ఇచ్చేయడానిక పోలీసులు పచ్చ జెండా ఊపేసారు.
తిరగడానికి ఉన్న ఏకైక బండి పోయిందే అని మదన పడుతున్న వారు ఇక సంతోషంగా వెళ్లి మీ ద్విచక్ర వాహనాన్ని తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ పోలీసులు ఓ చిన్న మెలిక పెడుతున్నారు. పోలీసులు పెడుతున్న ఆ చిన్న నిబంధన పాటించి ఎంచక్కా మీ వాహనాన్ని మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు.

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కేసులు నమోదు చేసిన వాహనాల విడుదలకు అనుమతులు లభించాయి. ఇందుకోసం తెలంగాణ పోలీసులు కొన్ని మార్గదర్శాకాలు రూపొదించినట్టు తెలుస్తోంది. వాహనాలపై ఇప్పటి వరకూ నమోదైన చలాన్స్ చెల్లించుకొని విడుదల చేసేందుకు రెఢీ అంటున్నారు తెలంగాణ పోలీసులు.
మొదటి సారి చాలన్ల పడిన వాహనాలపై సెక్షన్179 కింద కేసు నమోదు చేసి, సుమారు 500 రూపాయలను జరిమానా చెల్లించి వాహనాలను తీసుకెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు మార్గదర్శకాలు రూపొందించారు. కాగా జరిమానాను ఫోన్ పే, గూగుల్ పే, మీ సేవ ద్వారా చెల్లించే విధంగా వెసులుబాటు కల్పించారు. లాక్‌డౌన్ సమయంలో సుమారు ఒక లక్షా అరవై వేల వాహనాలను సీజ్ చేసినట్టు సమాచారం. ఇందులో లక్షకు పైగా సివిల్ పోలీసులు కేసులు నమోదు చేయగా, అరవై వేలకు పైగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications