• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణలో కరోనా మరో ట్విస్ట్ : నిజాముద్దీన్ తరహాలో దియోబంద్‌.. ఆ 2 కేసులతో లింకు...

|

కరోనా కేసుల్లో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. నిజాముద్దీన్ మర్కజ్ తరహాలో ఉత్తరప్రదేశ్‌లోని దియో బంద్‌కి వెళ్లి వచ్చిన ఇద్దరు నిర్మల్ జిల్లా వాసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు స్థానిక అధికారులు,పోలీసులు అప్రమత్తమై వీరిని గుర్తించినట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఇంటలిజెన్స్ అధికారులు వీరి వివరాలను గుర్తించినట్టు సమాచారం.

ఇంటలిజెన్స్ సమాచారంతో జిల్లా అధికారులు ఆ ఇద్దరిని ఆదివారం (ఏప్రిల్ 12) ప్రభుత్వాసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో జిల్లాలో దియోబంద్‌కి వెళ్లివచ్చినవారు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే తాజాగా పాజిటివ్‌గా తేలిన ఇద్దరి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను కూడా గుర్తించి క్వారెంటైన్ చేసినట్టు తెలుస్తోంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇంకెంతమంది ఉన్నారు...

ఇంకెంతమంది ఉన్నారు...

ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ జరిగిన సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్‌లోనూ మార్చి 9 నుంచి 11 తేదీల్లో మత ప్రార్థనలు జరిగాయి.తెలంగాణ నుంచి దియోబంద్‌కు పలువురు హాజరైనట్టుగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి జాతీయ మీడియాకు వెల్లడించారు. నిర్మల్ జిల్లా నుంచి దియోబంద్‌కి వెళ్లి వచ్చిన ముగ్గురిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందన్నారు. అక్కడికి వెళ్లి వచ్చినవారిలో కొందరు నేరుగా రాష్ట్రానికి రాగా.. మరికొందరు రాజస్తాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చినట్టుగా గుర్తించామన్నారు. పాజిటివ్‌గా తేలిన ఇద్దరి నుంచి ఇన్‌పుట్స్ తీసుకుని మిగతా వారి కోసం గాలిస్తామని చెప్పారు.

మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా భార్య,కుమారుడికి..

మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా భార్య,కుమారుడికి..

ఇదే నిర్మల్ జిల్లాలో మర్కజ్ వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా అతని భార్య,ఏడాదిన్నర బాబుకు కూడా కరోనా సోకినట్టు ఆదివారం గుర్తించారు. ఇక కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం వెలుగుచూసిన రెండు కేసుల్లో వారికి విదేశీ ట్రావెల్ హిస్టరీ గానీ,నిజాముద్దీన్ మర్కజ్ హిస్టరీ గానీ లేకపోవడం గమనార్హం. అంతకుముందు నిజాముద్దీన్ మర్కజ్‌కి వెళ్లి వచ్చిన వీరి తండ్రికి కరోనా నెగటివ్‌గా తేలింది. అయితే ఆయన ద్వారానే వీరికి వైరస్ సంక్రమించి ఉంటుందన్న అనుమానంతో మరోసారి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ముగ్గురిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆందోళన కలిగిస్తోన్న కేసులు

ఆందోళన కలిగిస్తోన్న కేసులు

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మర్కజ్ వెళ్లి వచ్చినవారు ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్చందంగా ముందుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా కరోనాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి ఆగట్లేదని.. ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 531 కేసులు నమోదవగా.. ఇందులో 103 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 16 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 412 యాక్టివ్ కేసులకు చికిత్స కొనసాగుతోంది.

English summary
Even as the police felt relieved that they could identify all the participants of Tablighi Jamaat Markaz congregation in Nizamuddin and their primary and secondary contacts from the State, police have stumbled upon people attending yet another similar congregation, around the same time in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X