తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల: ఇలా చెక్ చేసుకోండి
హైదరాబాద్: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2023) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన 'పాలిసెట్-2023' ఫలితాలను శుక్రవారం ఉదయం సాంకేతిక విద్యాశాఖ (ఎస్‌బీటీఈటీ) కమిషనర్ నవీన్ మిత్తల్, కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ విడుదల చేశారు.
ఈ మేరకు 80,752 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. పరీక్షల్లో 82.17 శాతం ఉత్తీర్ణత శాతం సాధించినట్లు తెలిపారు. పాలీసెట్ వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులు, అగ్రికల్చరల్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

పాలిసెట్-2023 నోటిఫికేషన్ జనవరి నెలలో విడుదల కాగా.. అదే నెల 16 నుంచి ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 17న పరీక్షను నిర్వహించగా.. మొత్తం లక్షా 5 వేల 742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 98 వేల 273 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యాన వన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించారు.
తెలంగాణ పాలిసెట్ ఫలితాలను ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోండి.












Click it and Unblock the Notifications