వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ముంద‌స్తు గుట్టు..! చంద్ర‌బాబు చేతిలో జుట్టు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఇవ్విళ్లూరుతున్న గులాబీ బాస్ ఆ దిశ‌గా చురుగ్గా పావులు క‌దుపుతున్నారు. సొంత పార్టీ నేత‌ల అభ్రిప్ర‌యాలు తెలుసుకోవ‌డంతో పాటు ముంద‌స్తు వాతావ‌ర‌ణం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా అనే అంశాల‌ను క్షుణ్నంగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు చంద్ర‌శేఖ‌ర్ రావు. అంతే కాకుండా ముంద‌స్తు ఎన్నిక‌ల‌ సాద్యాస‌ద్యాల‌పై కేంద్ర పెద్ద‌లతో చ‌ర్చించేందుకు రెఢీ అవుతున్నారు కేసీఆర్. జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ఎదుర్కొనేందుకు త‌లెంగాణ ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని ప్ర‌ధాని మోదీకి స్వ‌యంగా తెలిపారు కేసీఆర్.

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం చ‌క‌చ‌కా ఏర్పాట్లు.. ఢిల్లీ నేత‌ల‌తో కేసీఆర్ చ‌ర్చ‌లు..!

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం చ‌క‌చ‌కా ఏర్పాట్లు.. ఢిల్లీ నేత‌ల‌తో కేసీఆర్ చ‌ర్చ‌లు..!

మ‌రో అడుగు ముందుకేసి వ‌చ్చే నెల సెప్టెంబ‌ర్ లో శాస‌న స‌భ‌ను ర‌ద్దు చేసి సీట్ల వ్య‌వ‌హారం తేల్చుతాన‌ని చెప్పుకొచ్చారు. అందుకోసం ముఖ్య‌నేత‌ల అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసి వారి వారి ఆలోచ‌నా విధానాన్ని తెలుసుకున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఇంత చురుగ్గా స‌న్నాహాలు చేస్తున్న కేసీఆర్ ఆ ఒక్క విష‌యంలో ఎందుకు వెన‌క‌డుగు వేస్తున్నారు,,? తెలంగాణలో ముంద‌స్తు ఎన్నికలు నిర్వ‌హిస్తే ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో చికాకులు త‌ప్ప‌వ‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో ముంద‌స్తుకెళితే ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో కేసీఆర్ కొచ్చే అన‌ర్థం ఏంటి..? జాతీయ స్థాయిలో దేశ‌నేత‌ల‌ను సంప్ర‌దిస్తున్న కేసీఆర్ ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ర‌తిచ‌ర్య‌ల‌పై ఎందుకు జంకుతున్నారు..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

కేసీఆర్ ఎన్నిక‌ల వ్యూహం సూప‌ర్..! స్థ‌ర‌త్వం లేక‌పోవ‌డ‌మే బేకార్..!

కేసీఆర్ ఎన్నిక‌ల వ్యూహం సూప‌ర్..! స్థ‌ర‌త్వం లేక‌పోవ‌డ‌మే బేకార్..!

ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ చెప్పేందుకు అనుస‌రించే వ్యూహం తెలంగాణ ముఖ్య‌మంత్రిని ప‌వ‌ర్‌ఫుల్ నేత‌గా మార్చాయి. అంత‌వ‌ర‌కూ ఓకే.. ఐదేళ్ల‌పాటు అధికారం చేతికి అంద‌గానే.. 2019 టార్గెట్‌గా వ‌ల‌స‌ల‌కు శ్రీకారంచుట్టారు. టీడీపీ, కాంగ్రెస్‌ల‌ను నిస్తేజం చేసేందుకు అన్ని మార్గాలు అనుస‌రించారు. నాలుగేళ్లు గ‌డిచాక‌.. త‌మ‌కు తిరుగులేదు. మ‌రోసారి త‌మ‌దే అధికారం అనేంత‌గా కేసీఆర్ ఆత్మ‌విశ్వాసం పెరిగింది. కానీ.. గ్రౌండ్ లెవ‌ల్లో త‌మ శ్రేణులు బ‌లంగాలేవ‌ని గుర్తించారు. అందుకే కులాల వారీగా వ‌రాలు ప్ర‌క‌టించారు. మిష‌న్ భ‌గీర‌థ‌, కాక‌తీయ‌, కాళేశ్వ‌రం వంటి దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు త‌మ‌కు ఓట్లు కురిపిస్తాయ‌ని భావించారు. కానీ.. ఇప్పుడేం చేశార‌నేది జ‌నం చూస్తార‌నే విష‌యం అర్ధం కావ‌టంతో.. రైతుల‌కు ముంద‌స్తు పెట్టుబ‌డి, కంటివెలుగు, కేసీఆర్‌కిట్ల‌తో హ‌ల్‌చ‌ల్‌చేశారు.

ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలే గెలిపిస్తాయ‌న్న ధీమా..! అందుకే రైతుల‌కు భీమా..!

ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలే గెలిపిస్తాయ‌న్న ధీమా..! అందుకే రైతుల‌కు భీమా..!

జ‌నంలో టీఆర్ ఎస్ పేరు న‌లుగుతున్న స‌మ‌యంలోనే ఎన్నిక‌ల‌కు వెళ్లే గెలుస్తామ‌నే ధీమాకు చేరారు. అందుకే నిన్న‌,మొన్న ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై మంత్రుల‌తో మంత‌నాలు జ‌రిపారు. అటువైపు నుంచి ఇప్పుడొద్దంటూ స‌మాధానం ఎదుర‌వ‌టంతో.. అయోమ‌యంలో ప‌డ్డారు. అందుకే.. తూచ్‌.. ముంద‌స్తు లేద‌న్నారు. మ‌ళ్లీ ఏమైందో ఏమో.. ఢిల్లీకు ప‌య‌న‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో రాష్ట్రంలోని కీల‌క అధికారులు ఎన్నిక‌ల అదికారిని క‌లిశారు. దీంతో తెలంగాణ రాజ‌కీయం వేడెక్కింది. నెల‌, రెండునెల‌ల్లో కేసీఆర్ అసెంబ్లీను ర‌ద్దు చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా మొద‌లైంది. కానీ కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే ఏపీలో చంద్ర‌బాబు ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌నే సందేహం గులాబీ నేత‌ల్లో నెల‌కొంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

అంతా రైట్ రైట్..! చంద్ర‌బాబు వ్యూహం పైన మాత్ర‌మే డౌట్.!.

అంతా రైట్ రైట్..! చంద్ర‌బాబు వ్యూహం పైన మాత్ర‌మే డౌట్.!.

ఎందుకంటే.. ఒక‌వేళ తెలంగాణ‌లో ఎన్నిక‌లు ముందుగా వ‌స్తే చంద్ర‌బాబు మ‌కాం హైద‌రాబాద్ మార్చుతారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో తిరుగులేని చాణ‌క్య‌త ప్ర‌ద‌ర్శించ‌గ‌ల చంద్ర‌బాబును ఎదుర్కోనేందుకు ఇక్క‌డ స‌రైన వ్యూహ‌క‌ర్త లేడు. అటువంటి స‌మ‌యంలో కేసీఆర్ లెక్క‌లు త‌ప్పి.. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుతో అధికారం దూర‌మైతే ఏమిట‌నే భ‌యం కూడా గులాబీ బాసులో ఉంద‌ని స‌మాచారం. అందుకే.. చంద్ర‌బాబు తీసుకునే నిర్ణ‌యం ఆధారంగా తాము స్పందిద్దామ‌నే సూచ‌న కూడా కొంద‌రు సీనియ‌ర్లు కేసీఆర్ చెవిలో ఊదార‌ట‌. మ‌రి.. ఆ మాట‌లు లెక్క‌చేస్తారా! పెడ‌చెవిన పెట్టి.. ముంద‌స్తు సై అంటారా!

English summary
telangana cm kcr is planning to go pre elections in telangana and will be meeting central ministers. kcr suffering how the chandrababu plan will be regarding pre elections. if telangana goes pre elactions what chandra babu will do politically.. kcr discussing interestingly with the trs cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X