జోరు వానలు... తెలంగాణకు తీవ్ర హెచ్చరిక

దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలతోపాటు పశ్చిమ హిమాలయాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలో కూడా మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దాదాపు నెల రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో సూర్యుడు కనపడటంలేదంటూ అతిశయోక్తి కాదు. మబ్బులు మసకేసి ఉండటంతో ఏ నిముషంలోనైనా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా మొత్తం వాతవరణం మారిపోయింది.

కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు
హైదరాబాద్ లో జోరుగా వానలు కురవడంతోపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మెరుపులతోపాటు పిడుగులు పడతాయని తెలిపింది.

telangana rains update and rains in telangana for next two days

ఎల్లో అలర్ట్ జారీ
దీంతో ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లవద్దని, హైదరాబాద్ లో సోమవారం మొత్తం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఆ తర్వాత జల్లులు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

మంగళవారం కూడా ఇదే తరహా వాతావరణం నెలకొంటుందని, అయితే మధ్యాహ్న సమయంలో కొంత ఎండ ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో వాతావరణం మార్పు చేర్పులకు గురవుతుందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్రమైన ఎండ ఉంటుందని చెప్పింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+