తుఫాన్ దెబ్బకు మబ్బేసిన తెలంగాణా... ఈ జిల్లాలకు వర్షసూచన!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఫెంగల్ తుఫాన్ గా రూపాంతరం చెంది అది పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన విషయం తెలిసిందే. ఇక ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంతో పాటు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణాలో మోస్తరు వర్షాలు
ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలు వర్షాల ధాటికి చిగురుటాకులా వణికి పోతున్నాయి. ప్రస్తుతం చలికాలంలో చలి తీవ్రత పెరగడంతో పాటు విపరీతమైన చలిగాలులు వీస్తున్న వేళ వర్షాలు కూడా కురవడంతో తెలంగాణ వాసులు ఇబ్బంది పడుతున్నారు. నేడు తెలంగాణలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Telangana rains update cyclone fengal effect today moderate rains in these districts

నేడు ఈ జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను కూడా జారీ చేశారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ,, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాల కారణంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారింది. గత రెండు రోజులుగా హైదరాబాద్లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది. ఇదిలా ఉంటే ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసాయి.

పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
ఇటు హైదరాబాద్ నగరంలో కూడా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసాయి. ఇక చలికాలంలో కురుస్తున్న ఈ వర్షాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎటువంటి హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+