ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. ఐఎండీ తీవ్ర హెచ్చరిక!!

తెలంగాణ రాష్ట్రంలో గత పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా అనేక ప్రాంతాలలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండి నిండుకుండల్లా తలపిస్తున్నాయి. కొన్ని జిల్లాలలో ఇప్పటికే ఆశించిన దాని కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

తెలంగాణా వ్యాప్తంగా వర్షాలు
ఇక నేడు కూడా రాష్ట్రవ్యాప్తంగా ను అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉత్తర బంగాళాఖాతం లో బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.

Telangana rains update red alert to these districts IMD serious warning

నేడు వర్షాలు పడే జిల్లాలివే
సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్లు ఎత్తువరకు ఆవర్తనం విస్తరించి ఉందని ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలలో నేడు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణా జిల్లాలకు రెడ్ అలెర్ట్
ఈ ప్రాంతాలలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఇటు హైదరాబాద్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలు అలెర్ట్ గా ఉండాలి
ఇక నేడు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని, వర్షాల సమయంలో చెట్ల క్రిందకు వెళ్లొద్దు అని, ఫోన్లు వాడొద్దని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ను వచ్చే రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+