కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్: పెండింగ్ బిల్లుల అంశంపై తేల్చేసిన తెలంగాణ రాజ్‌భవన్
హైదరాబాద్: పెండింగ్ బిల్లులు అంశంపై గత కొంత కాలంగా రాజ్‌భవన్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అభివృద్ధిని అడ్డుకునే విధంగా గవర్నర్ బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారంటూ అధికార పార్టీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా, ఈ పెండింగ్ బిల్లుల అంశంపై రాజ్‌భవన్ స్పష్టనిచ్చింది.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని రాజ్‌భవన్ తేల్చి చెప్పింది. గతంలోనే 3 బిల్లులను ఆమోదించారని తెలిపింది. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని పేర్కొంది. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు వెల్లడించింది.

కాగా, మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా పెండింగ్ బిల్లుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీని అడ్డుకుంటున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ప్రధాని మోడీ ఒక మాట చెబితే బాగుండేదని కేటీఆర్ అన్నారు. ఈ విమర్శల నేపథ్యంలోనే రాజ్‌భవన్ స్పందించినట్లు తెలుస్తోంది.
జులై 8న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన విషయం తెలిసిందే. రూ. 6100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని మోడీ ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. రూ.2,147 కోట్ల వ్యయంతో... జగిత్యాల-కరీంనగర్ -వరంగల్ ఇంటర్ కారిడార్‌కు, రూ.3,441 కోట్ల వ్యయంతో ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారికి ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణంతో కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. తయారీ యూనిట్ నెలకు దాదాపు 200 వ్యాగన్‌లను ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం.. 'సబ్కా సాథ్, సబ్ కా వికాస్' కేంద్ర విధానమని ప్రధాని స్పష్టం చేశారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications